మిర్చి బజ్జీల కోసం అంబులెన్స్‌ సైరన్..పోలీసులు సీరియస్

ఎమర్జెన్సీ కోసం వినియోగించాల్సిన అంబులెన్స్‌ను ఓ డ్రైవర్‌ దుర్వినియోగం చేశాడు.

By Srikanth Gundamalla  Published on  11 July 2023 4:33 PM IST
Ambulance Siren, Mirchi Bajji, Driver, Hyderabad,

మిర్చి బజ్జీల కోసం అంబులెన్స్‌ సైరన్..పోలీసులు సీరియస్

అంబులెన్స్‌ అంటేనే ఎమర్జెన్సీ అనుకుంటారు ఎవరైనా.. అవును కదా. రద్దీగా ఉన్న రోడ్డుపై ఒక అంబులెన్స్‌ కుయ్‌ కుయ్‌ అంటూ వస్తుందంటే ఎవరైనా సైడ్‌ ఇస్తారు. ట్రాఫిక్‌ పోలీసులు కూడా రూట్‌ను క్లియర్‌ చేస్తారు. దాదాపుగా అందరూ ఒక్క క్షణం అంబులెన్స్‌లో ఎవరికో సీరియస్‌గా ఉండి ఉంటుంది.. క్షేమంగా కోలుకోవాలని కోరుకుంటారు. కానీ..ఇలా ఎమర్జెన్సీ కోసం వినియోగించాల్సిన అంబులెన్స్‌ను ఓ డ్రైవర్‌ దుర్వినియోగం చేశాడు. అవసరం లేకున్నా సైరన్ మోగించి.. చిక్కుల్లో పడ్డాడు.

హైదరాబాద్ నగరంలోని అంబర్పేట్ వద్ద ఓ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో సైరన్‌ వేసుకుని వేగంగా వచ్చింది. దాంతో... ట్రాఫిక్‌ పోలీసులు ఏదో ఎమెర్జనీ ఉండి ఉంటుందని భావించి.. వెంటనే రూట్ క్లియర్‌ చేశారు. ఇతర వాహనాదారులు కూడా సహకరించి రోడ్డుపై నుంచి పక్కకు జరిగి అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. అయితే.. అంబులెన్స్‌ సైరన్‌ డ్రైవర్ వేసుకుని చివరకు ఓ టిఫిన్‌ సెంటర్‌ వద్ద ఆపి టిఫిన్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దాంతో.. అక్కడే ఉన్న పోలీసులు దీన్ని గమనించి వారి దగ్గరకు వెళ్లి ప్రశ్నించాడు. మిర్చి, కూల్‌డ్రింక్‌ కొనుకున్న అంబులెన్స్‌ డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంబులెన్స్‌ సైరన్‌ను ఎమర్జెన్సీ సేవలకు వినియోగించాలి.. ఇలా కేవలం మిర్చి బజ్జి తినేందుకు వినియోగించొద్దు అని మండిపడ్డాడు. సదురు డ్రైవర్‌ పొంతన లేని సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశాడు. నీరసం వస్తుందంటూ అందుకే వేగంగా వచ్చి మిర్జి బజ్జి కోసం వచ్చి ఆగానని చెప్పే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ నిర్లక్ష్యపు సమాధానంతో ట్రాఫిక్‌ పోలీస్‌ మరింత ఫైర్ అయ్యాడు. ఇలా సైరన్‌ను దుర్వినియోగం చేస్తే డ్రైవర్‌తో పాటు ఆస్పత్రిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ కూడా సీరియస్‌ అయ్యారు. అంబులెన్స్‌ సైరన్‌ను ఇష్టం వచ్చినట్లు వాడితో కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. కేవలం మిర్చి బజ్జి కోసం అంబులెన్స్‌ సైరన్ వేసుకుని వెళ్లిన సదురు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్‌ ఉంటేనే సైరన్ ఉపయోగించాలని డీజీపీ అంజనీకుమార్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Next Story