Telangana: ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన ఎంఐఎం
తెలంగాణ ఎన్నికల కోసం ఎంఐఎం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 3:00 PM ISTTelangana: ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన ఎంఐఎం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డవారు పార్టీలు మారుతున్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు.. దాదాపు ప్రధాన పార్టీల్లోని నాయకులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. అయితే.. మిగతావారు ఏమో కానీ.. ఎంఐఎం మాత్రం వారివారికి ఉన్న నియోజకవర్గాల్లో వారి గెలుపు ఖాయంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఎన్నికల కోసం ఎంఐఎం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ నుంచి పోటీ చేయనున్న ఆరుగురు అభ్యర్థుల పేర్లను బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.
1. చాంద్రాయణగుట్ట - అక్బరుద్దీన్ ఒవైసీ
2. నాంపల్లి - మాజిద్ హుస్సేన్ (మాజీ మేయర్)
3. మలక్‌పేట్ - అహ్మద్ బలాలా
4. యాకుత్‌పురా - జాఫర్ హుస్సేన్ మెరాజ్
5. చార్మినార్ - మాజీ మేయర్ మీర్ జుల్ఫేకర్ అలీ
6. కార్వాన్-కౌస్ఫర్. రెండో జాబితాలో బహదూర్‌పురా
ఇకజజ జూబ్లీహిల్స్, రాజేందర్ నగర్ అభ్యర్థులను ప్రకటించనున్నారు.
2012లో హైదరాబాద్ నగర మేయర్‌గా, ప్రస్తుతం మెహదీపట్నం నుంచి జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌గా పనిచేసిన మాజిద్ హుస్సేన్ నాంపల్లి నుంచి పోటీ చేయడం ఆశ్చర్యం కలిగించే అంశం. కాగా, యాకుత్‌పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా క్వాద్రీ, చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌లను తప్పించగా, మరికొందరిని పార్టీ నిలబెట్టుకుంది. నాంపల్లి ఎమ్మెల్యేను యాకుత్‌పురా నుంచి పోటీ చేయాలని కోరారు. హైదరాబాద్ మాజీ మేయర్ మీర్ జుల్ఫెకర్ అలీ చార్మినార్ నుంచి పోటీ చేయనున్నారు.
హైదరాబాద్‌లో ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా (మలక్‌పేట్), జాఫర్ హుస్సేన్ (నాంపల్లి), కౌసర్ మొహియుద్దీన్ (కార్వాన్), ముంతాజ్ అహ్మద్ ఖాన్ (చార్మినార్), అక్బరుద్దీన్ ఒవైసీ (చంద్రాయణగుట్ట), సయ్యద్ అహ్మద్ పాషా క్వాద్రీ (యాకుత్‌పురా) మరియు మహ్మద్. మోజమ్ ఖాన్ (బహదూర్‌పురా).