హైదరాబాద్‌లో ఘోర ప్ర‌మాదం.. ఇద్ద‌రు స‌జీవ ద‌హ‌నం

Accident In Hyderabad. హైదరాబాద్ లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. క‌రెంట్ షాక్‌తో మంటలు చెల‌రేగి ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు.

By Medi Samrat  Published on  5 May 2021 2:41 PM IST
accident

హైదరాబాద్ లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. క‌రెంట్ షాక్‌తో మంటలు చెల‌రేగి ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. రాజస్థాన్‌కు చెందిన కంటైనర్ శంషాబాద్ నుంచి ఉప్పల్ ఐడీఏకు కార్ల లోడ్‌తో బయల్దేరింది. మాడ్రన్ బెడ్ ప్రాంతంలో విద్యుత్ తీగలకు కంటైనర్ తగలడంతో ఒక్క‌సారిగా మంటలు వ్యాపించి.. అక్క‌డిక‌క్క‌డే వాహ‌నంలోని ఇద్దరు సజీవదహనమయ్యారు. చ‌నిపోయిన వారిని షహజాద్‌(38), గంగా సాగర్(50) లు గా గుర్తించారు. ఒక‌రు కంటైన‌ర్ డ్రైవ‌ర్ కాగా, మ‌రొక‌రు హైదరాబాద్ వాసి, లోకల్ గైడ్‌.

ప్ర‌మాదతీవ్ర‌త‌కు ఆ కంటైనర్‌లోని కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు అక్క‌డకు చేరుకుని ప‌రిశీలించారు. ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story