చదువు నేర్పిన సంస్కారం ఇదేనా..? అమ్మకు చోటివ్వలేదు
A Woman sits floor carrying child in Hyderabad Metro Rail.చదువు సంస్కారం నేర్పుతుందని అంటారు. ఈ రోజుల్లో చదువుకున్న
By తోట వంశీ కుమార్ Published on 26 Oct 2021 8:38 AM ISTచదువు సంస్కారం నేర్పుతుందని అంటారు. ఈ రోజుల్లో చదువుకున్న వాడికంటే చదువు లేని వాడే చాలా ఉన్నంతంగా ఆలోచిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తూ... మేము క్లాస్, నాగరికులం అని చెప్పుకుంటూ... పక్కన ఉన్నవారిని పట్టించుకోని మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేయడం వరకే మానవత్వం పరిమితమైంది. కళ్ల ఎదురుగా చంటి బిడ్డతో ఓ అమ్మ నిలుచుని ఉంటే.. సీటు ఇవ్వాల్సింది పోయి ఫోన్లు చూస్తూ.. పక్కవారితో మాట్లాడుకుంటూ.. ఎవ్వరి పనుల్లో వారు ఉన్నారు. పాపం ఆ అమ్మ ఎవ్వరిని సీటు అడగలేక.. ఎక్కువ సేపు నిలబడడానికి ఇబ్బందిగా ఉండడంతో కింద కూర్చోని తన గమస్థానాన్ని చేరుకుంది. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఆ మహిళకు ఎదురుగా రెండు పక్కలా కూర్చున్న వారంతా ఆడవాళ్లే. వారిలో ఒక్కరికి కూడా ఆ మహిళ పట్ల జాలి కలగలేదు.
హైదరాబాద్ మెట్రో రైలులో జరిగిన ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. నెలల పసికందుతో ఓ మహిళ మెట్రో రైలు ఎక్కింది. అయితే.. అప్పటికే అక్కడ ఉన్న సీట్లన్ని నిండిపోయాయి. ఆ బోగిలో ఉన్నవారందరూ మహిళలే. చేతిలో చంటి బిడ్డతో ఎక్కిన ఆ అమ్మను చూసిన ఒక్కరు కూడా ఆమెకు సీటు ఇవ్వలేదు. మనకెందుకు అన్నట్లు సెల్‌ఫోన్లు చూసుకుంటూ, పక్కనున్న వారితో ముచ్చట్లు చెప్పకుంటూ ఉన్నారు. ఎవరినైనా సీటు అడుగుదాం అనుకుంటే.. ఎవరు ఎలా స్పందిస్తారోనన్న భయంతో ఆ మహిళ మిన్నుకుండిపోయింది. రైలు ప్రయాణిస్తుండడంతో ఎక్కువ సేపు నిలుచోలేక కింద కూర్చుని.. ఒడిలో బిడ్డను పెట్టుకుని తన గమ్యస్థానం వరకు ప్రయాణించింది.
దీన్ని వీడియో తీసిన ఓ ప్రయాణీకుడు 'గ్రేట్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఇన్ హైదరాబాద్' అనే క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎప్పుడు జరిగింది అన్న వివరాలు లేవు కానీ.. ఈ వీడియో చూసిన నెటీజన్లు ప్రయాణీకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసికందును భద్రంగా పట్టుకుని కిందకూర్చుని ప్రయాణించిన ఆమెలో నిజమైన భారతీయ మాతృహృదయ గొప్పతనం కనిపించిందంటూ ప్రశంసించారు.