Hyderabad: డేటింగ్ యాప్స్ వాడుతున్నారా.. అయితే తస్మాత్‌ జాగ్రత్త

హైదరాబాద్‌ నగరంలో కొత్తరకం డేటింగ్ స్కామ్ మొదలైంది. ఇటీవల చాలా మంది అబ్బా యిలు.. అమ్మాయిల మోజులో పడి డేటింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు.

By అంజి  Published on  7 Jun 2024 2:30 AM GMT
dating scam , Hyderabad city, HiTech City

Hyderabad: డేటింగ్ యాప్స్ వాడుతున్నారా.. అయితే తస్మాత్‌ జాగ్రత్త

హైదరాబాద్‌ నగరంలో కొత్తరకం డేటింగ్ స్కామ్ మొదలైంది. ఇటీవల చాలా మంది అబ్బా యిలు.. అమ్మాయిల మోజులో పడి డేటింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు.. అయితే దాన్నే అలుసుగా తీసుకున్న కొంత మంది పబ్ ఓనర్స్ అమ్మాయిలతో కలిసి కొత్త రకం మోసానికి తెరలేపారు. ఇటీవల టిండర్‌లో ఓ అబ్బాయికి రితికా అనే అమ్మాయి పరిచయం అయ్యింది. గంటలు తరబడి మాట్లాడుకున్నారు. పరిచయం అయిన మరుసటి రోజే అబ్బాయిని కలుద్దామని చెప్పి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకి రావాలని కోరింది. తర్వాత రోజు ఇద్దరు మెట్రో స్టేషన్ వద్ద కలుసుకున్నారు.. అయితే ఆ అమ్మాయి పక్కనే ఉన్న గ్యాలేరియా మాల్ లోని మోష్ క్లబ్‌కి వెళ్దామని అతడిని అడిగింది. అందుకు అంగీకరించిన అతడు అలాగేనని తనని తీసుకు వెళ్లాడు.

అతడిని క్లబ్ లోకి తీసుకు వెళ్లిన ఆమె తియ్యని మాటలు చెప్పి ఖరీదైన మద్యం ఆర్డర్ చేసింది. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేశారు. తీరా బిల్ చూసి అతను ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. మొత్తం 40,505 రూపా యిలు బిల్ అయ్యింది. కుర్రో మొర్రో అనుకుంటూ బిల్లు మొత్తం కట్టాడు బాధితుడు. ఆ తర్వాత ఈ మొత్తం బిల్లుపై అనుమానం వచ్చి అతడు క్లబ్ యొక్క గూగుల్ రివ్యూస్ చూడగా ఇలాగే మోసపోయిన వేరే యూసర్ రాసిన రివ్యూ చూసి కంగుతున్నాడు. క్లబ్ వాళ్లు అమ్మాయిలతో కలిసి చేస్తున్న మోసమని అర్థం చేసుకున్నాడు. ఇలాగే ఆ అమ్మాయి, పబ్ చేతిలో చాలా మంది మోసపోయి.. 20 వేల నుండి 40 వేల నష్ట పోయారు. తనలాగే ఎవరు మోసపోకూడదు అంటూ సోషల్ మీడియాలో వాటన్నిటిని అతడు పోస్ట్ చేశాడు.

Next Story