క‌స్ట‌మ‌ర్‌ను క‌త్తితో పొడిచిన ఫుడ్‌ డెలివ‌రీ బాయ్‌

A food delivery boy who stabbed a customer. హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. గచ్చిబౌలిలో గల ఓ అపార్ట్‌మెంట్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన కస్టమర్‌ని ఫుడ్‌ డెలివరీ

By అంజి  Published on  9 Sept 2022 3:12 PM IST
క‌స్ట‌మ‌ర్‌ను క‌త్తితో పొడిచిన ఫుడ్‌ డెలివ‌రీ బాయ్‌

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. గచ్చిబౌలిలో గల ఓ అపార్ట్‌మెంట్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన కస్టమర్‌ని ఫుడ్‌ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ కత్తితో పొడిచిన ఘటన గురువారం రాత్రి జరిగింది. గచ్చిబౌలిలోని గోల్ఫ్‌ ఎడ్జ్‌ అపార్ట్‌మెంట్‌కు చెందిన ఆదిత్య అనే వ్యక్తి ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడు. దీంతో ఫుడ్‌ డెలివరీ కోసం డెలివరీ ఎగ్జిక్యూటివ్ వచ్చాడు. ఈ క్రమంలోనే డెలివరీ ఎగ్జిక్యూటివ్‌కు, కస్టమర్ మధ్య పేమెంట్‌ విషయంలో గొడవ జరిగింది. ఇరువురి మధ్య వాదన జరిగింది. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ కస్టమర్‌పై దాడి చేశారని, ఆదిత్యపై పదునైన వస్తువుతో దాడి జరిగినట్లు తెలిసింది. అనంతరం డెలివరీ బాయ్‌ అక్కడి నుంచి పరారయ్యాడు.

కత్తి దాడిలో గాయపడిన ఆదిత్యను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ కూడా గాయపడ్డాడు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదుచేసిన గచ్చిబౌలి పోలీసులు విచారణ జరుపుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సదరు డెలివరీ బాయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. పోలీసుల విచారణలో ఫుడ్ డెలివరీ కాస్తా.. కత్తిపోట్ల వరకు ఎందుకు వెళ్లిందో తెలియాల్సి ఉంది.

Next Story