కేర్ ఆస్పత్రిలో 80 ఏళ్ల రోగికి అరుదైన చికిత్స సక్సెస్
హైదరాబాద్‌లోని మలక్‌పేట్ కేర్ ఆస్పత్రిలో వైద్యులు అరుదైన వెన్నుముక శస్త్ర చికిత్స చేశారు.
By Srikanth Gundamalla Published on 22 Jun 2023 1:15 PM GMTకేర్ ఆస్పత్రిలో 80 ఏళ్ల రోగికి అరుదైన చికిత్స సక్సెస్
హైదరాబాద్‌లోని మలక్‌పేట్ కేర్ ఆస్పత్రిలో వైద్యులు అరుదైన వెన్నుముక శస్త్ర చికిత్స చేశారు. వెర్టెబ్రా-స్టెంటోప్లాస్టీ అనే అరుదైన చికిత్స చేశామని.. అది విజయవంతం అయినట్లు వైద్యులు ప్రకటించారు. వెన్నుముక నొప్పిని తగ్గించి, తక్కువ సమయంలో చలనశీలతను పునరుద్ధరించడం ద్వారా వెన్నుముక పగుళ్ల చికిత్సలో విప్లవాత్మక మార్పులు చేశారు కేర్ ఆస్పత్రి వైద్యులు. సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ కెవి శివానందరెడ్డితో పాటు అతని బృందం ఈ అరుదైన చికిత్సను పూర్తి చేశారు.
డాక్టర్ కెవి శివానందరెడ్డి వైద్య బృందం తెలిపిన వివరాల ప్రకారం.. "80 ఏళ్ల మహిళా రోగి చిదమ్మ (పేరు మార్చబడింది)కు వెర్టెబ్రా-స్టెంటోప్లాస్టీ చికిత్స నిర్వహించాం. చిదమ్మ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతూ కేర్ ఆస్పత్రిని సంప్రదించారు. గతంలో మరో ఆస్పత్రిలోనూ వెన్నుముక ఫ్యాక్చర్ ఆపరేషన్ చేయించుకున్నారు. కానీ ఆమెకు ఉపశమనం లభించలేదు. దీంతో..మేం ఆమెకు వివిధ పరీక్షలు నిర్వహించాం. అంతకుముందు ఆమె వెన్నుముకకు బిగించిన స్క్రూలను తొలగించి.. కనిష్టంగా ఇన్వాసిస్ వెర్టెబ్రా-స్టెంటోప్లాస్టీని విజయవంతంగా నిర్వహించాం. సర్జరీ సమయంల వెన్నుపూస శరీర ఎత్తును పునరుద్ధరించడానికి ద్వైపాక్షిక బుడగలు ఉపయోగించబడ్డాయి. తర్వాత సిమెంట్‌తో పెంచబడింది. ఆ తర్వాత శస్త్ర చికిత్స విజయవంతం అయ్యింది. చిదమ్మ తన నొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం పొందింది".
ఆమె ఎలాంటి సపోర్ట్ లేకుండా కూర్చునే సామర్ధ్యాన్ని పొందింది. చాలా తక్కువ సమయంలో ఆమె జీవన నాణ్యతలో గణనీయమైన మెరుగుదలని తీసుకురాగలిగామని చెప్పారు. చిదమ్మకు సానుకూల ఫలితాన్ని సాధించడం పట్ల సంతోషంగా ఉన్నామని డాక్టర్ కెవి శివానందరెడ్డి అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి కేసులకు చికిత్స అందిస్తామని ఆయన తెలిపారు. కేర్ హాస్పిటల్ రోగులకు మంచి చికిత్స అందించడంలో ముందుంది అని ఆస్పత్రి HCOO శ్రీకృష్ణ మూర్తి తెలిపారు.
వెర్టెబ్రా-స్టెంటోప్లాస్టీ హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో నిర్వహించిన అరుదైన చికిత్స. ఇది అసాధారణమైనది కూడా. 80 ఏళ్ల రోగిలో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా వైద్య బృందం యొక్క నైపుణ్యాన్ని, నిబద్ధతను తెలుపుతోంది.