సందడి సందడిగా హైదరాబాద్ సైక్లింగ్ రెవోల్యుషన్ 2.0

1500 Hyd cyclists pedal to celebrate new cycling track.హైదరాబాద్ సైక్లింగ్ రెవోల్యుషన్ 2.0 సందడి.. సందడిగా సాగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Sep 2022 6:11 AM GMT
సందడి సందడిగా హైదరాబాద్ సైక్లింగ్ రెవోల్యుషన్ 2.0

హైదరాబాద్ సైక్లింగ్ రెవోల్యుషన్ 2.0 సందడి.. సందడిగా సాగింది. నగరానికి చెందిన 1500 మందికి పైగా సైక్లిస్టులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. తూర్పున ఉప్పల్‌ నుంచి పశ్చిమాన గచ్చిబౌలి వరకు, దక్షిణాన టీఎస్‌పీఏ జంక్షన్‌ నుంచి ఉత్తరాన సుచిత్ర వరకు హైదరాబాద్‌ నలుమూలల నుంచి వందలాది మంది ద్విచక్రవాహనదారులు ప్రయాణించి దుర్గం చెరువు కేబుల్‌ వంతెన వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ లో ఇది రెండో సీజన్. సైక్లిస్టులు కూడా నగర రోడ్లను పంచుకుంటారని ప్రజలకు అర్థమయ్యేలా వివరించడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటి ఈవెంట్ నిర్వహించబడింది. మొదటి కార్యక్రమంలో దాదాపు 350 మంది పాల్గొన్నారు.


ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడమే అని నిర్వాహకులు తెలిపారు. సైకిల్ ట్రాక్‌కు పునాది వేశారు, వచ్చే ఏడాది నాటికి హైదరాబాద్‌లో 23 కి.మీ సోలార్ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. సైకిల్ ట్రాక్ నానక్రంగూడ మరియు తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ (టిఎస్‌పిఎ) మధ్య 8.5 కి.మీ, నార్సింగి-కొల్లూరు మధ్య 14.5 కి.మీ. సైకిల్ ట్రాక్ కోసం సెలెక్ట్ చేశారు. సర్వీస్ రోడ్డు మధ్య ORR సర్వీస్ రహదారిని సైకిల్ ట్రాక్ కోసం ఉపయోగిస్తారు. ఐటీ కారిడార్‌ సమీపంలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్ట్‌తో పెద్ద సంఖ్యలో సైకిల్‌పై వెళ్ళవచ్చు.


"యాక్టివ్ మొబిలిటీ గురించి అవగాహన కల్పించడానికి కూడా ఈ కార్యక్రమం జరిగింది. సైకిల్ ట్రాక్‌లు వేయడం అంతిమ పరిష్కారం కాదు. మెరుగైన ప్రజా రవాణా, మెరుగైన ఫుట్‌పాత్‌లు కూడా ఉండాలి. నడక, సైక్లింగ్ మరియు ప్రజా రవాణా శాశ్వత స్థిరమైన పరిష్కారం. వాతావరణాన్ని కూడా కాపాడవచ్చు" బైసైకిల్ మేయర్ ఆఫ్ హైదరాబాద్ సంతాన సెల్వన్ అన్నారు. "ఈ ఈవెంట్ ద్వారా, ఎక్కువ మంది వ్యక్తులు సైక్లింగ్‌ను ఒక అభిరుచిగా చేసుకోవడం మాత్రమే కాకుండా రోజువారీ ప్రయాణానికి ఒక సాధనంగా వాడుతారని మేము ఆశిస్తున్నాము," అని చెప్పుకొచ్చారు.

దేశంలో మొట్టమొదటి సారిగా ఫార్ములా-ఇ కార్ రేసింగ్

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఎఫ్ఐఏ ఫార్ములా-ఇ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ప్రతినిధులతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విద్యుత్ ఆధారంగా నడిచే సింగిల్ సీటర్ కారును ఈ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ కోసం వినియోగిస్తారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద సెప్టెంబరు 25 ఉదయం పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఎరుపు రంగు ఎలక్ట్రానిక్ కారును ప్రజల కోసం ప్రదర్శించారు.

ఫార్ములా ఇ రేస్ డెమో కారును నగరంలో పలు ప్రాంతాల్లో పబ్లిక్ సందర్శనార్థం ఏర్పాటు చేస్తున్నారు. కారును ట్యాంక్ బండ్ పై ఆదివారం నాడు లాంచ్ చేశారు. మధ్యాహ్నానికి కారును ట్యాంక్ బండ్‌కు తరలించి, కొద్దిరోజుల పాటు అక్కడే ప్రదర్శించనున్నారు. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మధ్య ఫార్ములా రేసింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి. రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ గ్రీన్‌కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఫార్ములా ఈ రేసింగులను నిర్వహించనుంది. 2023 ఫిబ్రవరి 11వ తేదీన ఈ కార్ రేసింగ్ ఉంటుంది. లుంబినీ పార్క్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ పరిసర ప్రాంతాల్లో ఎంపిక చేసిన 2.3 కి.మీ రోడ్డును ఫార్ములా-ఇ రేసు కోసం ప్రభుత్వం ట్రాక్‌ నిర్మాణ పనులు శరవేగంగా నిర్వహిస్తున్నారు. రేసును చూడటానికి 30వేల మందికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


Next Story