హైదరాబాద్‌లో దారుణం.. ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్మ
By సుభాష్
హైదరాబాద్‌లో విషాద ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎందరో మహిళలు ఆత్మహత్యకు ఒడిగడుతున్నారు. కుటుంబ కలహాలో,
ఆర్థిక ఇబ్బందులే.. భార్య,భర్తల మధ్య మనస్పర్థలు ఇలా.. రకరకాల కారణాలతో మహిళలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా
చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి శ్రీవిద్య (26) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌కు చెందిన శ్రీవిద్యకు వరంగల్‌కు చెందిన శబరీష్‌తో ఆరు నెలల కిందట వివాహం జరిగింది. పని నిమిత్తం
శబరీష్ బెంగళూరుకు వెళ్లడంతో చందానగర్‌లోని అతడి కుటుంబ సభ్యుల ఇంటికి శ్రీవిద్య వెళ్లింది.
ఇక శనివారం మధ్యాహ్నం సమయంలో శబరీష్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండగా, వారి ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఈ క్రమంలో
భవనం నుంచి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన శ్రీవిద్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిచారు.
అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, భర్త వేధింపుల కారణంగానే శ్రీవిద్య ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు
నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.