జంటనగరాల్లో వర్ష బీభత్సం.. అధికారులకు చేదోడుగా ఉండాలని యువకులకు పిలుపునిచ్చిన నగర మేయర్!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Sep 2019 5:55 AM GMT
జంటనగరాల్లో వర్ష బీభత్సం.. అధికారులకు చేదోడుగా ఉండాలని యువకులకు పిలుపునిచ్చిన నగర మేయర్!

రహదారులన్నీ గోదారిని తలపించాయి. వర్షం ఆగిపోయినా రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో బస్సులు, కార్లూ, ఆటోలు ఆగిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ స్తంబించిపోయింది.

తాడ్ బండ్ నుంచీ సుచిత్ర వరకూ, గచ్చిబౌలీ, ఐకియా, శీల్పారామం, హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీహిల్స్ లలో ట్రాఫిక్ స్తంబించింది. పలు చోట్ల బైక్‌లు కొట్టుకుపోయాయి. మ్యాన్‌హోల్స్‌ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

హైదరాబాద్ రాంనగర్ అంజయ్య నగర్ లో కాలంలో వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి బస్తీవాసులు ఇబ్బంది పడ్డారు. పార్సిగుట్ట మధుర నగర్ కాలనీ లో ఇండ్ల లోకి భారీగా వరదనీరు వచ్చిచేరింది. సీతాఫల్మండి లో భారీ వర్షాలకు కూలిన గోడలను డిప్యూటీమేయర్ పరిశీలించారు.

ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ లోని ఇళ్లల్లో నడుం లోతు నీళ్లు. సంగీత్ వద్ద డీ మార్ట్ పార్కింగ్ వద్ద భారీగా చేరిన వరద నీరు. భారీ వర్షం కారణంగా మల్కజిగిరి లోని ఈస్ట్ ఆనంద్ బాగ్ , ఎన్.ఎం.డీసీ కాలనీ , రాజా నగర్ లో నాలలు పోంగి ఇళ్ళలోకి చేరిన నాలా నీళ్ళు. ఖైరతాబాద్ రైల్వే ట్రాక్ సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు నిర్వహిస్తున్న విధులను ఆకస్మికంగా తనిఖీ చేసిన నగర మేయర్ బొంతు రామ్మోహన్. ఖైరతాబాద్ ప్రధాన రహదారి, లక్డికాపూల్ మెట్రో స్టేషన్, కంట్రోల్ రూమ్, బషీర్బాగ్ ప్రాంతాల్లో పర్యటించి డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలతో నీటి నిల్వలను తొలగిస్తున్న మేయర్ రామ్మోహన్.

జిహెచ్ఎంసి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్ రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేసి నీటి నిల్వలను తొలగించే పనులను స్వయంగా పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జలమయమైన లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్న హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, జిహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి.

నగరంలో కురిసిన వర్షాలకు ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నగరంలో అత్యధికంగా 7నుండి 13 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. గత మూడు నాలుగేళ్లలో ఇదే అతి పెద్ద వర్షం. జిహెచ్ఎంసి సిబ్బంది, పోలీసులు తో పాటు రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయడం జరిగింది. బేగం బజార్లో కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాన్ని గుర్తించిన జిహెచ్ఎంసి సిబ్బంది. అందులో నివాసం ఉంటున్న వారిని తరలించారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, యువకులు, అపార్టుమెంటు వాసులు, స్థానిక యువకులు. అధికారులకు సహాయం చేయడంతో పాటు స్వచ్ఛందంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నైట్ షెల్టర్, భోజన వసతులు

ఏర్పాటు చేస్తున్నాము. ట్రాఫిక్, వాటర్ వర్క్స్ ఇతర డిపార్ట్మెంట్లు అప్రమత్తం చేయడం జరిగింది. జిహెచ్ఎంసి helpline కు కాల్ చేయండి. సహాయ కార్యక్రమాలు చేపట్టవలసిందిగా నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థలు యువకులు పిలుపునిచ్చిన నగర మేయర్.

Next Story