హైదరాబాద్‌లో భారీ వర్షం
By సుభాష్ Published on 1 Jan 2020 2:38 PM GMTవరుసగా రెండు రోజుల పాటు హైదబాద్ లో వర్షం కురిసింది. బుధవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారా హిల్, మాసబ్ ట్యాంక్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. నాంపల్లిలో భారీ వర్షం కారణంగా నుమాయిష్ ఎగ్జిషన్ ప్రారంభానికి అడ్డుగా మారింది. ఇక నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం రోజే వర్షం కురియడంతో సందర్శకుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. కాగా, వర్షానికి తోడు చలిగాలులు వీస్తుండటంతో నగర వాసులకు ఇబ్బందిగా మారింది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తుండటంతోనగర వాసులు వణికిపోతున్నారు. గురువారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Next Story