పోలీసుల సడన్ సర్‌ప్రైజ్.. అవాక్కయిన ఇంటివారు
By రాణి Published on 24 April 2020 11:47 AM GMTమొన్నీమధ్య అమెరికాలో ఓ బాలుడి పుట్టిన రోజున తన తండ్రి పోలీసులకు ఫోన్ చేయగా..స్వయంగా పోలీసులే ఇంటికొచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఇండియాలో అందులోనూ తెలంగాణలోని హైదరాబాద్ లో ఓ తల్లికి 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మల్కాజ్ గిరి పోలీసులు. వివరాల్లోకి వెళ్తే..
Also Read : అగ్రరాజ్యంలో అల్లకల్లోలం
మల్కాజ్ గిరి పోలీసులు శుక్రవారం ఓ తల్లి పుట్టిన రోజున సర్ ప్రైజ్ ఇచ్చారు. కన్న తల్లి 60వ జన్మదిన వేడుకలు దగ్గరుండి జరపాల్సిన కొడుకు విదేశాల్లో ఉన్నాడు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అతను స్వదేశానికి రాలేడు. కానీ తల్లి జన్మదిన వేడుకలు మాత్రం జరపాలని నిశ్చయించుకున్నాడు. ఈ మేరకు మల్కాజ్ గిరి డీసీపీ రక్షిత కె మూర్తి ఐపీఎస్ కు అల్ ఫ్రెడ్ అషర్ పాల్ తల్లూరి లేఖ రాశారు. తమ కుటుంబ సభ్యుల తరపున తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపాలని కోరాడు. నిజానికి తాము ఈ పుట్టినరోజును చాలా ఘనంగా నిర్వహించాలని అనుకున్నాం..కానీ కరోనా వల్ల అక్కడికి రాలేని పరిస్థితి నెలకొందని ఆ ఉత్తరంలో రాశారు. తమ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నట్లు ముందుగానే చెప్పొద్దని..చాలా సర్ ప్రైజింగ్ గా విష్ చేయాలని అషర్ విజ్ఞప్తి చేశారు. అది చూసిన రక్షిత ఆ మాతృమూర్తికి సర్ ప్రైజ్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలుపాల్సిందిగా ఇన్స్పెక్టర్ నరసింహ స్వామిని ఆదేశించారు.
Also Read : నాగబాబు కౌంటర్..విజయ సాయి రివర్స్ కౌంటర్
డీసీపీ ఆదేశాల మేరకు నరసింహ తన బృందంతో కలిసి సికింద్రాబాద్ నేరేడ్ మెట్ లోని సైనిక్ పురిలో ఉన్న రిటైర్డ్ టీచర్ కుట్టి హదస్సా పాల్ ఇంటి వద్దకెళ్లారు. ఇంటి బయట స్పీకర్లు ఏర్పాటు చేసి పాటపాడుతూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బయట పాట వినిపించగానే గేటు వద్దకొచ్చిన కుట్టి ఆశ్చర్యానికి గురయ్యారు. తన పుట్టిన రోజున పోలీసులు స్వయంగా తన ఇంటి వద్దకొచ్చి పాట పాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపడంతో ఉబ్బితబ్బిబ్బయింది. పాట పూర్తయ్యాక పండ్లు చేతికిచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది ఇన్ స్పెక్టర్ నరసింహ బృందం.