నాగబాబు కౌంటర్..విజయ సాయి రివర్స్ కౌంటర్

By రాణి  Published on  23 April 2020 3:12 PM GMT
నాగబాబు కౌంటర్..విజయ సాయి రివర్స్ కౌంటర్

మెగా బ్రదర్ నాగబాబు మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పై కౌంటర్ వేశారు. ఈ కౌంటర్ పై విజయసాయి కూడా పరోక్షంగా స్పందించారు. మాస్క్ ముక్కుకి వేసుకోవాలి గానీ గొంతుకి కాదు అని నాగబాబు కౌంటరిచ్చారు.

'' విజయ సాయి రెడ్డి .మాస్క్ ముక్కు నోటికిపెట్టుకోండి.గొంతుకి కాదు.ఒక వేళ మీరు asymptomatic అయినా ప్రాబ్లెమ్ ఉండదు.మీ సెక్యురిటి కూడా masks పెట్టుకున్నారు.మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త గా చూసుకోండి.ఫ్యూచర్ లో ఫైట్ చేసుకోవాలిగా మీతో. మీకు మాస్క్ వున్నా జనం గుర్తు పడతారు.నేను గ్యారంటీ..'' అని నాగబాబు ట్వీట్ చేశారు. బాబు ట్వీట్ చేసిన కొద్దిసేపటికే విజయ్ సాయిరెడ్డి ఈ ట్వీట్ పై స్పందించారు. పేర్లు చెప్పకుండానే రివర్స్ కౌంటర్ వేశారు.

Also Read : ఆరోగ్య సేతు సరికొత్త రికార్డ్

'' బాబు బిజెపిలోకి పంపిన సొంత మనిషి ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకని కోర్టుకెళ్లి జీఓను కొట్టేయిస్తాడు. గ్లాసు పార్టీపై ఎంపీగా పోటీ చేసిన నేత కరోనా సమయంలో పోలవరం పనులెలా కొనసాగిస్తారని సుప్రీంలో పిటీషిన్ వేస్తాడు. ప్రజలపై ఎందుకింత ద్వేషం? వీళ్ల వెనక ఉన్నదెవరు? '' అని విజయసాయి ట్వీట్ వేశారు.

Also Read : జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించాలి : పవన్ కల్యాణ్

ఆ తర్వాత నాగబాబు వరుసగా తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల్ని టార్గెట్ చేస్తూ ట్వీట్లేశారు. మాస్క్ లు వాడుతున్న ముఖ్యమంత్రులు, ప్రధాని అంటూ కేసీఆర్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, నరేంద్రమోదీ ఫొటోలను పెట్టారు. ఏపీసీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, రెండు రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు ఈటెల రాజేందర్, ఆళ్లనాని, మంత్రి అనిల్ కుమార్ లపై మాస్క్ లు ఉన్నా ఉపయోగించని మన నాయకులు అంటూ సెటైర్లేశారు.Next Story
Share it