మంచం పట్టిన మన్యం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Sept 2019 2:55 PM IST
మంచం పట్టిన మన్యం..!

* విషజ్వరాలు విజృంభన

* ఆంటీముట్టనట్టు ఆరోగ్యశాఖ

భద్రాచలం : దోమకనిపిస్తే చాలు జనాలు భయాందోళనాకు గురవుతున్నారు. ఒంటపై ఏది వాలిన దోమవాలిందని తెలంగాణలో ప్రజలకు కంటి మీద కునుకు కరువు ఆవుతోంది. తమకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లేదా చికెన్ గునియానో వచ్చేస్తున్నది భ్రాంతి చెందుతున్నారంటేనే రాష్ట్రంలో విషజ్వరాలు ఎలా ప్రభలుతున్నాయో తెలుస్తుంది.

డెంగ్యూ మరణాలు నమోదు అవుతున్నా..అబ్బే అదేంలేదంటోంది ఆరోగ్య శాఖ.కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వేలమంది జ్వరాలతో వైద్య సేవలకు వస్తున్నారంటే వాటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. ఇంటికొక్కరు మంచం పట్టారంటేనే పరిస్థితి ఊహించొచ్చు. విషజ్వరాలతో జనాలు పిట్టల్లా రాలుతున్నా ఆరోగ్యశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ల సంఖ్య చూస్తేనే జ్వరాల విజృంభన ఏ స్తాయిలో ఉందొ అర్ధమవుతుంది. రాష్ట్రంలో పారిశుధ్య లోపానికి తోడు ముసురు వానలు తోడవడంతో సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. ఏజెన్సీ జిల్లాలలో జ్వర పీడితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ప్రభుత్య దవాఖానాలో బెడ్లు సరిపోక ఒక్కో బెడ్ పైన ఇద్దరి, ముగ్గురికి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు.

ఏజెన్సీ గ్రామాలతో అన్ని ఏరియాల్లో పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దోమల మందు పిచికారీ చేయాలని, దోమ తెరలను పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. జిల్లాలలో ఫాగింగ్ మిషన్ల ద్వారా దోమలు లేకుండా చూడాలని, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఈ మరణాలకు పారిశుద్యశాఖ, వైద్య ఆరోగ్యశాఖలే ప్రధాన కారణమని ప్రజలు మండి పడుతున్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించి వైరల్ జ్వరాలు బారినుండి ప్రజలను కాపాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story