ఎట్టకేలకు ముగ్గురిని పట్టుకున్నారు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Sept 2019 7:21 PM ISTహైదరాబాద్ : అర్ధరాత్రి ఇళ్లు, జ్యువలర్ షాపులను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠాలో ముగ్గురిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముఠాను పట్టునే క్రమంలో ఎస్సైపైకి ఏకంగా వ్యాన్‌నే డ్రైవ్ చేశారు. ఈ ఘటనను పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నెల 22న దూలపల్లి సమీపంలో ఘటన జరిగింది. ముఠా సభ్యుల్లో ముగ్గురితోపాటు రూ.17లక్షల విలువైన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.
దూలపల్లి లో రహదారి ప్రక్కన ఉన్న సిసి టివి దృశ్యాలు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొంపల్లిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని విచారించగా..11 కేసుల్లో నిందితులని తేలింది. రంజిత్ సింగ్ (19), రణీత్ సింగ్ (43), మహారాష్ట్ర కు నర్సింగ్ సింగ్ (50)గుర్తించారు. ఆరుగురు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు. మరో ముగ్గురు నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు బాలానగర్ డిసిపి పద్మజ తెలిపారు.