బుద్వేల్ రైల్వే స్టేషన్ దగ్గర కారులో మంటలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Oct 2019 12:58 PM ISTహైదరాబాద్ : రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో బుద్వేల్ రైల్వే స్టేషన్ దగ్గర కారులో మంటలు చెలరేగాయి. అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రధాన ద్వారం సమీపంలో వెర్నా కారులో మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా కాలిపోయింది. కారు ముందు భాగం ఇంజన్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారికి ఎటువంటి గాయాలు కాలేదు. కారు యజమాని మహబూబ్ నగర్‌కి చెందిన అబ్దుల్ సయ్యద్ అలీ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story