మ‌రోసారి ఆగిన మెట్రో.. అవ‌స్థ‌లు ప‌డిన ప్ర‌యాణీకులు

By Newsmeter.Network  Published on  18 Jan 2020 9:13 AM GMT
మ‌రోసారి ఆగిన మెట్రో.. అవ‌స్థ‌లు ప‌డిన ప్ర‌యాణీకులు

హైదరాబాద్ : న‌గ‌రానికి మెట్రో రైల్ ఓ మ‌ణిహారం. మెట్రో రైలు వ‌చ్చాక ట్రాఫిక్ జాంల నుంచి న‌గ‌ర‌జీవికి కొంత ఉప‌శ‌మ‌నం ల‌భించింది. కాలుష్య ర‌హిత ప్ర‌యాణాన్ని అందిస్తుండ‌డంతో రోజుకు ల‌క్ష మందికి పైగా మెట్రోను ఆశ్ర‌యిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల కాలంలో మెట్రోలో సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. తాజాగా శ‌నివారం మియాపూర్ నుంచి ఎల్బీన‌గ‌ర్ కు వెళ్తున్న రైలు లో సాంకేతిక స‌మ‌స్య తలెత్తింది.

దీంతో పంజాగుట్ట దగ్గర ఆ ట్రైన్‌ను ఆగిపోయింది. రైలు ఎందుకు ఆగిందో తెలీక ప్ర‌యాణీకులు కాసేపు టెన్ష‌న్ ప‌డ్డారు. ఐతే.. 27 నిమిషాల తర్వాత ఆ ట్రైన్‌ను లూప్‌లైన్‌లో పెట్టి మిగతా రైళ్లు వెళ్లేందుకు వీలు కల్పించారు. దాంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరారు.

ఇంత‌క‌ముందు విద్యుత్ లైన్‌లు తెగిప‌డిన ఘ‌ట‌న‌లో హైటెక్ సిటీ నుంచి ఎల్‌బీనగర్ వెళ్తున్న మెట్రో రైలు అమీర్ పేట స్టేషన్ లో నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే.

Next Story