మెట్రో బంఫర్ ఆఫర్.. మందు బాబుల కోసమే..!
By Newsmeter.Network Published on 30 Dec 2019 3:24 PM ISTహైదరాబాద్: రేపు మెట్రో రైళ్ల పని వేళలను మెట్రో అధికారులు పొడిగించారు. రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్ల రాకపోకలు కొనసాగనున్నాయి. మద్యం సేవించినవారికి కూడా మెట్రో రైలులో అనుమతి ఇవ్వనున్నారు. అయితే ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని అధికారులు పేర్కొన్నారు. రేపు 2019 సంవత్సరానికి చివరి రోజు. బుధవారం 2020 జనవరి 1 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వేడుకల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల వల్ల చాలా మంది తమ ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో భాగంగానే హైదరాబాద్ మెట్రో అధికారులు ఈ చర్యలను చేపట్టినట్టు తెలుస్తోంది. మందుబాబుల కోసం మెట్రో పని వేళలను అధికారులు పొడిగించారు.
రోజువారీగా మాత్రం మెట్రో రైళ్లు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడవనున్నాయని మెట్రో అధికారులు ఇదివరకే ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన ఆర్టీసీ సమ్మె కాలంలో మెట్రో ప్రయాణ వేళలను పొడిగించారు. కాగా ఆ ప్రయాణవేళలను యాధావిధిగా కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ కారణంగా ప్రజలు ఎక్కువగా మెట్రోకి ప్రాధాన్యం చూపుతున్నారు. ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు వేగంగా తీసుకువెళ్తూ హైదరాబాద్ మెట్రో ప్రయాణికులను చూరగొంటోంది. ఇటీవల మెట్రో రైళ్లలో జీ5 మొబైల్ అప్లికేషన్ సేవలు ప్రారంభం అయ్యాయి. జీ5 సేవల ద్వారా మెట్రలో మొబైల్ డాటా వినియోగించకుండానే వీడియోలు, ఇంటర్నెట్ వాడుకోవచ్చు.