హైదరాబాద్‌లో భారీ వర్షం

By సుభాష్  Published on  23 July 2020 3:07 AM GMT
హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. రాత్రంతా ఉక్కపోతతో ఇబ్బందులకు గురైన నగర వాసులు .. భారీ వర్షం కురియడంతో కాస్త ఉపశమనం పొందారు. నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిపోయింది.

రోడ్లపై ఉన్నగుంతల్లో నీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, బంజారాహిల్స్‌, సోమాజిగూడ, అబిడ్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కోఠి, కుత్బుల్లాపూర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, తార్నాక, బోయిన్‌పల్లి, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఈ భారీ వర్షం కురిసింది.

Next Story
Share it