హైదరాబాద్‌లో 11 ఉచిత కరోనా పరీక్ష కేంద్రాలు

By సుభాష్  Published on  2 July 2020 3:37 AM GMT
హైదరాబాద్‌లో 11 ఉచిత కరోనా పరీక్ష కేంద్రాలు

తెలంగాణలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలు స్వచ్చంధంగా కరోనా కేంద్రానికి వెళ్లి ఉచితంగా పరీక్షలు చేయించుకునేలా అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇక కరోనా తీవ్రత ఉన్న హైదరాబాద్‌లో 11 ఉచిత పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేంద్రాలకు సంబంధించి ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వివరాలు వెల్లడించారు. ఏర్పాటు చేసిన ఆయన కేంద్రాల్లో ఉచితంగా కరోనా పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు.

ఉచిత కరోనా పరీక్ష కేంద్రాలు ఇవే..

 1. కోఠిలోని కింగ్‌ కోఠి ఆస్పత్రి
 2. నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రి
 3. కొండాపూర్‌లోని ఏరియా ఆస్పత్రి
 4. ఎర్రగడ్డలోని ఆయుర్వేదిక్‌ ఆస్పత్రి
 5. ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్
 6. మెహదీపట్నంలోని సరోజినిదేవి కంటి ఆస్పత్రి
 7. అమీర్‌పేట్‌లోని నేచుర్‌ క్యూర్‌ ఆస్పత్రి
 8. రామంతపూర్‌లోని హోమియోపతి ఆస్పత్రి
 9. వనస్థలిపురంలోని ఏరియా ఆస్పత్రి
 10. నాచారంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి
 11. చార్మినార్‌లోని నిజామియా ఆస్పత్రి

Next Story