అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌ వాసుల మృతి

By Newsmeter.Network
Published on : 25 Feb 2020 5:08 PM IST

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌ వాసుల మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు హైదరాబాద్‌ వాసులు మృతి చెందారు. మృతుల్లో భార్యభర్తతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. మృతులను ముషీరాబాద్‌లోని గాంధీనగర్‌కు చెందిన దివ్య ఆవుల(34), రాజా(41), ప్రేమ్‌నాథ్‌ రామనాథం (42)గా గుర్తించారు. వీరు అమెరికాలోని టెక్సాస్‌లోని ప్రిస్కోలో నివసిస్తున్నారు.

భారత కాలమానం సోమవారం తెల్లవారుజామున ఎఫ్ఎం 423 ఇంటర్‌సెక్షన్‌ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును మరోకారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. వీరిలో దివ్య, రాజా భార్యాభర్తలు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Untitled 4 Copy

Next Story