సూర్యాపేట: హుజూర్ నగర్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థినిగా అధిష్టానం ఉత్తమ్ పద్మావతి రెడ్డిని ఖరారు చేసింది. గతంలో కోదాడ నియోజక వర్గం నుంచి 2014లో శాసన సభ్యురాలిగా ఎన్నికైన ఆమె.. 2018 లో టీఆర్ఎస్ అభ్యర్ధిపై  ఓడిపోయారు.  ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ శాసన సభ్యులుగా, టీపీసీసీ చీఫ్ గా  ఉన్నారు. దీంతో .. పద్మావతి రెడ్డి కోదాడతో పాటు హుజుర్ నగర్ వ్యవహారాలు కూడా చూసుకునేవారు. అయితే 2019 లోకసభ ఎన్నికలలో  ఉత్తమ్ నల్గొండ లోక్ సభ స్థానం నుండి ఎంపీగా  గెలిచారు. ఈ విజయంతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉత్తమ్ కు హుజుర్ నగర్ లో మంచి పట్టు ఉండటం.. సిట్టింగ్ స్థానం కావడంతో ఉత్తమ్ పద్మావతి రెడ్డికే పోటీ చేసే అవకాశం లభించింది. మరోవైపు టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూడా ఉత్తమ్ ఇలాఖాలో గులాబీ జెండా పాతాలని పట్టుదలతో వున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.