ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న హుజూర్ నగర్
By న్యూస్‌మీటర్ తెలుగు
సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం అవుతుంది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు లక్షల 36వేల 842 మంది ఓటర్లు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో మొత్తం 302 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో 7 మండలాలు ఉన్నాయి. నేరేడుచర్ల మండలంలో మొత్తం 34వేల 87 మంది ఓటర్లు ఉంటే..43పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పాలకీడు మండలంలో 19వేల 639 మంది ఓటర్లు ఉండగా..25పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మఠంపల్లి మండలంలో 34వేల885మంది ఓటర్లు ఉండగా..43 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మేళ్ళచెరువు మండలంలో 31వేల 270 మంది ఓటర్లు ఉంటే..41పోలింగ్ కేంద్రాలు రెడీగా ఉన్నాయి. చింతల పాలెం మండలంలో 25వేల 228 మంది ఓటర్లు ఉంటే...36 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. హుజూర్ నగర్ మండలంలో 47వేల 886 ఓటర్లుంటే..57 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గరిడే పల్లి మండలంలో 43వేల 877 మంది ఓటర్లు ఉంటే...57పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 79
31 పోలింగ్ కేంద్రాలు అర్బన్‌లో ఉంటే...271 పోలింగ్ కేంద్రాలు రూరల్‌లో ఉన్నాయి. మొత్తం పోలింగ్ కేంద్రాలు 302. వీటిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను 79గా గుర్తించారు.
ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు
POS -392
APOS- 392
OPOS -392
SOS -27+1
SST- 9
FST- 7
MCC- 7
VST- 8
VVT- 1
AT -2
AEO -3
రూట్ అధికారులను 27+1గా నియమించారు. మొత్తం ప్రచార వాహనాలు 104, ఇప్పటి వరకు 10 కేసులు నమోదయ్యాయి. అయితే.. సి విజిల్ ద్వారా 15 కేసులు వచ్చాయి. రూ.72లక్షల 29వేల 500లు సీజ్ చేశారు. అక్టోబర్ 21 హుజూర్ నగర్ లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు..24న ప్రకటిస్తారు.