హుజూర్‌నగర్‌: ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని రిటర్నింగ్‌ అధికారిని అభ్యర్ధులు కోరారు. కాంగ్రెస్‌, బీజేపీ సహా 9 మంది అభ్యర్థులు ఈ మేరకు రిటర్నింగ్ అధికారికి లేఖ ఇచ్చారు.

ఇక ..హుజూర్ నగర్ లో టీఆర్‌ఎస్ కారు దూసుకుపోతుంది. ఇప్పటికీ టీఆర్‌ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి 16వేల పైచిలుకు ఓట్ల మెజార్టీలో ఉన్నారు. గులాబీ విజయం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో పోటీ చేసిన ప్రత్యర్ధులు వీవీ ప్యాట్‌లు లెక్కించాని లేఖ ఇచ్చారు. దీనిపై రిటర్నింగ్ అధికారి ఎలా స్పందిస్తారో చూడాలి.

huzur-nagar-counting-v-v-pats

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.