హ్యూస్టన్ లో 'సైరా' సందడి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Sep 2019 5:52 AM GMTటాలీవుడ్‌లో ప్రప్రధమంగా స్వతంత్ర ఉద్యమ నేపధ్యంతో రూపొందించిన మెగా మూవీ 'సైరా నరసింహా రెడ్డి' . ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రం లోని హ్యూస్టన్ లో మెగా అభిమానులు సందడి చేశారు. మెగా అభిమానులు రవి వర్రె , బద్రుద్ధీన్ పిట్టర్ ఆధ్వర్యంలో హ్యూస్టన్ మెగా అభిమానులు గోదావరి రెస్టారెంట్లో 'సైరా' ప్రమోషన్ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉయ్యలవాడ శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. ఉయ్యలవాడ బుద్ధా రెడ్డి మునిమనవలు ఉయ్యలవాడ శ్రీనివాసులు రెడ్డి . ఉయ్యాలవాడ బుద్ధా రెడ్డి ( బుద్ధన్న ) ఉయ్యలవాడ నరసింహారెడ్డితో కలిసి బ్రిటీష్ వారితో యుద్ధం చేశారు.
రవి వర్రే మాట్లాడుతూ... మెగా కుటుంబంతో తమ అనుబంధం, భీమవరం కాలేజి రోజుల్లో మెగా స్టార్ సినిమాల సందడి, మెగా టెక్సాస్ సినిమాస్ ఖైది 150 సందర్భంగా అమెరికా మొత్తం జరిపిన ప్రమోషన్, హ్యూస్టన్ నుంచి ఆట్లాంటా ఖైది 150 బస్సు యాత్ర... పలు విషయాలు ప్రమోషన్ కార్యక్రమంలో పంచుకున్నారు.
బద్రుద్ధీన్ పిట్టర్ మాట్లాడుతూ... ముందుగా సైరోత్సవాలకి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ. ఉయ్యలవాడ నరసింహారెడ్డి గురించి తన చిన్ననాటి నుంచి తెలిసిన విషయాలు, తమ స్వస్థలం బనగానపల్లె, కోయిలకుంట్ల ప్రాంతాలలో ఉయ్యలవాడ వారి యుద్ధభూమి విశేషాలు వివరించారు.
ఈ కార్యక్రమానికి అంట్లాంటా నుంచి విచ్చేసిన మెగాభిమాని సాగర్ లగిశెట్టి మాట్లాడుతూ... అనాటి ఖైది నుంచి నిన్నటి ఖైది 150, నేటి సైరా వరకూ మెగాస్టార్ చరిష్మా, తమ చిన్ననాటి మెగా అనుభూతులు, వైజాగ్ లో మెగాస్టార్ బెనిఫిట్ షో హడావిడి తోటివారితో పంచుకున్నారు.
చారిత్రత్మకమైన ఈ స్వాతంత్రయోధ సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కృష్ణారెడ్డి .ఈ సైరోత్సవాలకి ప్రధాన అతిథిగా హాజరైన . ఉయ్యాలవాడ శ్రీనివాసులు రెడ్డి వారి పెద్దలు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర సమరంలో తమ కుటుంభం పాలుపంచుకున్న విషయాలను పూసగుచ్చినట్లు చెప్పారు. తమ తాత ముత్తాతల నుండి ఉయ్యలవాడ నరసింహ రెడ్డి గురించి తమకు తెలిసిన విశేషాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. తదనంతరం తమ కుటుంబ పాత్రను తెలిపారు. ఆ మహా యోధుడి వీరమరణం గురించి చెబుతున్నప్పుడు అక్కడి వారి కళ్లు చెమర్చాయి. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి తలను 30 ఏళ్లు కోటకు వేలడదీసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు శ్రీనివాసులు రెడ్డి.