ఏపీలో ప్రాజెక్ట్‌లకు భారీ వరద..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Oct 2019 4:25 PM ISTఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వరద ప్రవాహానికి నదులన్నీ నిండిపోయాయి. దీంతో కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో కృష్ణానది పరివాహాకప్రాంతాల్లోని నదులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఈ బ్యారేజ్ ఇన్ ఫ్లో 4,60,000 క్యూసెక్కులు ఉంటే .. ఔట్ ఫ్లో 4,95,054 క్యూసెక్కులుగా ఉంది. సుంకేశుల బ్యారేజ్‌లో ఇన్ ఫ్లో 1,87,077 క్యూసెక్కులు... ఔట్ ఫ్లో 1,8,089 క్యూసెక్కులు. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 6,61,157 క్యూసెక్కులు ..ఔట్ ఫ్లో 6,13,089 క్యూసెక్కులు. ఇంకా నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,06,470 సమానంగా ఉంది. పులిచింతల ప్రాజెక్టు వద్ద ఇన్ ఫ్లో 4,8,987 క్యూసెక్కులు ..ఔట్ ఫ్లో4,95,054 క్యూసెక్కులు. దీంతో ఏపీ విపత్తు శాఖ . జిల్లా అధికార యంత్రాంగాన్ని, NDRF, SDRF బృందాలను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. నది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.