కరోనా పై గెలిచేందుకు బీసీసీఐ చిట్కాలు.. వెరైటీగా క్రికెటర్ల ఫోటోలతో..
By తోట వంశీ కుమార్ Published on 27 March 2020 12:25 PM IST�
కరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచ వ్యాప్తంగా 20వేల మందికి పైగా మృత్యువాత పడగా.. ఐదులక్షలకు పైగా కరోనా పాజిటివ్ తో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భారత్‌లో కూడా ఈ మహమ్మారి విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 724 కేసులు నమోదవ్వగా 13 మంది మృతి చెందారు. ఈ వైరస్‌ను అడ్డుకోవాలంలటే ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపించకుండా సామాజిక దూరం పాటించాలి. అప్పుడు మాత్రమే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి వీలుఉంటుంది.
ఇప్పటికే భారత్ కరోనా కట్టడిని చేయడానికి 21 రోజుల లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. కాగా ఈ వైరస్ నుంచి కాపాడుకోవడానికి బీసీసీఐ పలు సూచనలు చేసింది. వాటికి టీమ్ఇండియా క్రికెటర్ల ఫోటోలు జతచేసి అభిమానులకు కనువిందు చేసింది. అవేంటో మీరు ఓ సారి చూసేయండి..