వికారాబాద్‌ జిల్లాలోని పరిగిలో ఘరాన మోసం జరిగింది. అతి తక్కువ ధరకే హోం నీడ్స్ ఇస్తామని చెప్పిన మోసగాళ్లు, డబ్బులు వసూలు ఉడాయించారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళనాడు కు చెందిన వ్యక్తులు పరిగిలో రోజా ట్రైడర్స్ పేరుతో హోంనిడ్స్ నిర్వహణ కొనసాగిస్తున్నారు. వస్తువు విలువలో సగం డబ్బులు చెల్లించి వారం రోజుల తర్వాత తీసుకుంటే సగం ధరకే ఇస్తామని మోసగాళ్లు నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన వినియోగదారులు వేల రూపాయలు చెల్లించారు. దీంతో చెల్లించిన డబ్బులు తీసుకొని ట్రైడర్‌ యాజమాన్యం రాత్రికి రాత్రే ఉడాయించారు. బాధితులు పోలీసులను అశ్రయించడంతో, దాదాపు 50లక్షల వరకు మోసం చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.