వాషింగ్టన్‌: చంద్రయాన్‌ -2ని భారత్ ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో ప్రపంచం మొత్తానికి తెలుసు. చివరి రెండు నిమిషాల్లో ‘విక్రమ్‌’తో కమ్యూనికేషన్ తెగిపోయిన సంగతి తెలిసిందే. అయితే..ప్రపంచవ్యాప్తంగా ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు కురుస్తుంది. అయితే..హాలివుడ్ నటుడు బ్రాడ్ పిట్ అంతరిక్షానికి సంబంధించిన హాలివుడ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా నాసా కేంద్రంలో బ్రాడ్ పిట్ సందడి చేశాడు. ఇంటర్నెషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో ఉన్న ఆస్ట్రోనాట్‌ నిక్‌ హెగ్యూకు వీడియో కాల్‌ చేసి పిట్ మాట్లాడాడు. వీరిద్దరు ఇరవై నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. మాటలు సందర్భంగా బ్రాడ్‌ పిట్‌ ‘భారత్‌ చంద్రుడి మీద ప్రయోగాల కోసం ఉద్దేశించిన’ విక్రమ్‌’ ల్యాండర్‌ ఆచూకీని కనిపెట్టారా’ అని నిక్‌ని అడిగాడు. అందుకు అతడు దురదృష్టవశాత్తు ఇంకా లేదు అని బదులిచ్చాడు. ‘ విక్రమ్’ కోసం ఇస్రో – నాసా కలిసి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.