మునిసిపల్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్.. కారణం తెలుసా..?

By అంజి  Published on  6 Jan 2020 4:41 PM GMT
మునిసిపల్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్.. కారణం తెలుసా..?

హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నిలను తాత్కాలికంగా ఆపాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తాము ఆదేశించేవరకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే రేపు ఉదయం మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడేది. ఇప్పుడు హైకోర్టు తాత్కాలిక బ్రేక్‌ వేడయంతో.. ఎన్నికల ఏర్పాట్లకు విఘాతం కలిగినట్లైంది. మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్‌లో సరైన నిబంధనలు పాటించలేదం హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ తరఫున రవిశంకర్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ హైకోర్టు విచారించింది. రిజర్వేషన్లు ఖరారు చేసిన నెలరోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఎన్నికల మ్యానువల్‌ తప్పుగా ఇవ్వడంపై మండిపడింది. తదుపరి విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. కాగా మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌లో మరింత జాప్యం జరిగే అవకాశాలున్నాయి.

Next Story
Share it