స‌రిహ‌ద్దుల వ‌ద్ద భారీగా వ‌ల‌స‌దారులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 May 2020 3:19 PM GMT
స‌రిహ‌ద్దుల వ‌ద్ద భారీగా వ‌ల‌స‌దారులు

ఒక రాష్ట్రంలో ఇచ్చిన పాసులు మ‌రో రాష్ట్రంలో చెల్ల‌వంటూ అధికారులు చెబుతుండ‌డంతో వ‌ల‌స‌కూలీల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ముందుకు వెళ్ల‌లేక‌.. తిరిగి వెన‌క్కి వెళ్ల‌లేక స‌రిహ‌ద్దు గ్రామాల వ‌ద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. తెలంగాణ – ఏపీ సరిహద్దు వాడపల్లి దగ్గర కూలీలు పడిగాపులు గాస్తున్నారు. ఉదయం నుంచి సరిహద్దు వద్ద ఏపీ కూలీలు ఇబ్బంది పడుతున్నారు. కూలీలకు తెలంగాణ పోలీసులు జారీ చేసిన పాసులు చెల్ల‌వంటూ.. గుంటూరు పోలీసులు ఏపీలోకి వ‌చ్చేందుకు అనుమ‌తి నిరాక‌రిస్తున్నారు. దీంతో స‌రిహ‌ద్దులోనే కూలీలు ఇబ్బంది ప‌డుతున్నారు.

Next Story
Share it