అమరావతి: ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్‌ అయింది. రాజధానిపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని ఆదేశించింది. రాజధాని ప్రాంతంలో సౌకర్యాలపై ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలని నిలదీసింది. స్విస్‌ ఛాలెంజ్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం…అమరావతిలో న్యాయమూర్తులకు క్వార్టర్లు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ను వాయిదా వేయాలని ప్రభుత్వం తరుపున న్యాయవాది కోరడంతో..నవంబర్‌ 3 కి హైకోర్టు విచారణ వాయిదా వేసింది.

అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రాజధాని మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజధానిని అమరావతి నుంచి షిప్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కేపిటల్ గా అమరావతి సేఫ్ కాదని మంత్రులు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో రాజధాని తరలింపు ఖాయం అనే డిస్కషన్ జరిగింది. దీనికి తోడు.. అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు జరగడం లేదు. పనులన్నీ ఆపేసింది జగన్ సర్కార్. దీంతో అనుమానాలు బలపడ్డాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.