రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేయండి : హైకోర్టు
By Medi SamratPublished on : 25 Oct 2019 1:59 PM IST

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేయవల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు కూకట్‌పల్లి కోర్టుకు హైకోర్టు ఆదేశాలు పంపింది. అలాగే.. రెండు రూ.15వేల ష్యూరిటీలు, పర్సనల్ బాండు సమర్పించాలని హైకోర్టు రవిప్రకాష్‌ను ఆదేశించింది.
టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో రవిప్రకాష్ తన సొంత ప్రయోజనాల కోసం సంస్థ నిధులు వాడుకున్నారనే అభియోగాలతో పోలీసులు ఆయను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే.. రవిప్రకాష్ ను కస్టడీకి అనుమతించాలని ఇటీవల నాంపల్లి సీబీఐ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
Next Story