ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మపై హైకోర్ట్ ఆగ్రహం..!

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 3 Nov 2019 6:28 PM IST

ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మపై హైకోర్ట్ ఆగ్రహం..!

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నెల రోజులకు చేరుకుంది. సమస్యలను షరిష్కరించేంత వరకూ సమ్మెను ఆపేది లేదని కార్మిక నేతలు ప్రకటించిన విషయం తెలిసందే. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయం సరికాదని అశ్వత్థామరెడ్డి అన్నారు. డెడ్‌లైన్లు పెట్టడం కేసీఆర్‌కు కొత్త కాదని.. కోర్టులను కూడా సీఎం కేసీఆర్‌ డిక్టేట్‌ చేస్తున్నారని అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు.

ఇదిలా ఉంటే నవంబర్‌ 7న ఆర్టీసీ సమ్మెపై విచారణకు హాజరుకావాలని సీఎస్‌ ఎస్‌.కె.జోషి, ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ, ఆర్థిక ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశించింది. ఈనెల 1 జరిగిన విచారణ అనంతరం కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఆర్టీసీ ఇంఛార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ తప్పుడు అఫిడవిట్‌ను సమర్పించారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2013-2014 నుంచి గత నెల 1 వరకు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల వివరాలను నివేదిక రూపంలో అందించాలని కోర్టు తెలిపింది.

Next Story