అమరావతి: పోలవరం పనులకు ‘కోర్ట్’ అడ్డంకి తొలగింది. పోలవరం పనులపై హై కోర్ట్ స్టే ఎత్తేసింది. నవయుగ దాఖలు చేసిన పిటిషన్‌పై గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.  ఆర్బిట్రేషన్‌ ప్రక్రియ మొదలైన తర్వాత రిట్‌ పిటిషన్‌కు విలువ ఉండదన్న ఏజీ వాదనతో హైకోర్ట్ ఏకీభవించింది. బ్యాంకు గ్యారంటీలను ఎన్‌ క్యాష్‌ చేయకూడదంటూ దిగువ కోర్టు ఇచ్చిన ఇన్‌జంక్షన్‌ను హై కోర్ట్ పక్కన పెట్టింది.దిగువ కోర్ట్ తీర్పును హైకోర్ట్ తప్పబట్టింది. ఇరు పార్టీల వాదనలు విని, మళ్లీ తీర్పును పునఃపరిశీలించాలని హైకోర్ట్ సూచించింది.

పోలవరంపై హై కోర్ట్ తీర్పును స్వాగతిస్తున్నాం – మంత్రి అనిల్

పోలవరం పై హై కోర్ట్ తీర్పును స్వాగతిస్తున్నామన్నారు నీటి పారుదల శాఖ మంత్రి అనిల్. కోర్ట్ తీర్పు ప్రతిపక్షానికి చెంప పెట్టు అన్నారు. పోలవరం నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వం ప్రజాధనాన్ని ఆదా చేస్తుందన్నారు. పోలవరం విషయంలో ప్రభుత్వం పై ఇప్పటికైనా విపక్షాలు విమర్శలు మానుకోవాలన్నారు.గోదావరి లో వరద తగ్గిన వెంటనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేపడతామన్నారు మంత్రి అనిల్.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.