రాష్ట్రంలో డెంగీ నివారణపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. డెంగీ వచ్చిన మనుషులు చనిపోతున్నా.. ప్రభుత్వం సరైన వైద్య సదుపాయం అందించటంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం సరిగ్గా స్పందించనందునే డెంగీ బారీన పడిన రోగులు మృత్యువాత పడినట్లు కోర్టు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా డెంగీపై ప్రజల్లో కనీస అవగహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపింది. నివారణ చర్యలపై వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య, మున్సిపల్‌ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు రేపు ఉదయం కోర్టులో హాజరు కావాలంటూ ఆదేశించింది.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story