ఆర్టీసీ సమ్మె పిటిషన్ ను 15 కు వాయిదా వేసిన హైకోర్టు...!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2019 9:10 AM GMT
ఆర్టీసీ సమ్మె పిటిషన్ ను 15 కు వాయిదా వేసిన హైకోర్టు...!

హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై హైకోర్ట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోసారి పూర్తి వివరాలుతో రిపోర్ట్ అందించాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని హైకోర్ట్ ఆదేశించింది. అంతేకాదు..బస్ పాస్ హోల్డర్లను అనుమతిస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే అన్ని డిపో మేనేజర్లకు ఆదేశాలు ఇచ్చామని ప్రభుత్వం హైకోర్ట్‌కు తెలిపింది. వాదనలు విన్న హైకోర్ట్ పిటిషన్‌ను 15కు వాయిదా వేసింది.

సమ్మె కొనసాగుతోంది: అశ్వత్థామ రెడ్డి

సమస్యల అన్నిటినీ హై కోర్ట్ దృష్టికి తీసుకొచ్చినట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రకటిస్తామన్నారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు అశ్వత్ధామ రెడ్డి. నోటీసులు వచ్చాక స్పందిస్తామన్నారు. చట్టబద్ధంగానే సమ్మె చేస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీని బతికించుకుంటేనే..ప్రజారవాణా బతుకుతుందన్నారు.

Next Story