డేటింగ్‌లో 'బుట్టబొమ్మ'? ఇంత‌కీ ఎవ‌రితో..!

By అంజి  Published on  22 Jan 2020 3:36 AM GMT
డేటింగ్‌లో బుట్టబొమ్మ? ఇంత‌కీ ఎవ‌రితో..!

సామ‌జ వ‌ర‌గ‌మ‌న సాంగ్ అల వైకుంఠ‌పురంలో మూవీకి హైలెట్‌గా నిలిచింది. దాంతోపాటు బుట్ట బొమ్మా పాట‌లో పూజాహెగ్దే కాళ్ల‌ను బాగానే ఎక్స్‌పోజ్ చేసింది. న‌డుము గురించ‌ని ఆలోచించ‌ని వారు కాళ్ల గురించి ఎందుకంత విమ‌ర్శిస్తున్నారో అర్ధం కావ‌డం లేదంటోంది.

తెలుగులో అత్య‌ధిక పారితోష‌కం తీసుకుంటూ ప్ర‌స్తుతం టాప్ హీరోయిన్‌గా న‌టిస్తోంది పూజా హెగ్దే. అలా వైకుంఠ‌పురం చిత్రంతో వ‌రుస‌గా ఐదు హిట్‌లు పొందిన ఘ‌న‌త ద‌క్కించుకుంది. తాజాగా, అల్లు అర్జున్ సినిమా హిట్ ఆనందంలో ఉబ్బి త‌బ్బుబ్బైపోతుంది.

ఇదిలా ఉండ‌గా, పూజా హెగ్దేకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ పొడుగుకాళ్ల సుంద‌రి హిందీ న‌టుడు రోహ‌న్ మెహ్రాతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డింద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. వీరిద్ద‌రూ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నార‌ని టాక్ విన‌ప‌డుతుంది.

బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ వినోద్ మెహ్రా త‌న‌యుడే రోహ‌న్ మెహ్రా. అయితే, ఈ డేటింగ్ వార్త‌ల‌పై పూజా నుంచి ఎటువంటి స్పంద‌నా రాలేదు. ఈ భామ ప్ర‌స్తుతం రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో ఓ సినిమా, అక్కినేని అఖిల్‌తో మ‌రో సినిమా చేస్తోంది.

Next Story
Share it