'ఇందు' కన్నా ఎక్కువ విలనీ కావాలి : పాయల్
By రాణి Published on 29 Feb 2020 5:32 PM ISTపాయల్ రాజ్ పుత్.. గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రెస్..యాక్టింగ్ కూడా మొదటి సినిమా 'ఆర్ఎక్స్ 100' తోనే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ఒక్క సినిమాతో ఆమెకు వచ్చిన స్టార్డమ్ అంతా..ఇంతా కాదు. మొదటి సినిమాలోనే నెగటివ్ రోల్ చేయడం అన్నది సాహసమే.. అలాంటి సాహసాన్ని ఎంతో ఈజీగా చేసేసింది పాయల్ రాజ్ పుత్. 'పిల్లా రా' సాంగ్ బ్లాక్ బస్టర్ గా నిలవడం.. పాయల్ క్యారెక్టర్ ఇచ్చే ట్విస్టులు.. సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశాయి. హీరో కంటే హీరోయిన్ కే ఎక్కువ పేరు తీసుకుని వచ్చే సినిమాలు చాలా అరుదుగా వచ్చే ఈ కాలంలో ఆమె మాత్రం ఆర్ఎక్స్ 100 తో అద్భుతాన్ని చేసి చూపించింది. ఈ సినిమా తర్వాత పాయల్ కెరీర్ రాకెట్ లా దూసుకుపోయింది.
తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఇంకా నెగటివ్ క్యారెక్టర్స్ చేయడానికి ఎదురుచూస్తున్నానంటూ చెప్పడం విశేషం. ఆర్ఎక్స్ 100 లో 'ఇందు' లాంటి క్యారెక్టర్ దొరకడం చాలా అదృష్టమని.. అంతకు మించిన నెగటివ్ క్యారెక్టర్ చేయాలని తనకు ఉందని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే తనకు కంఫర్ట్ గా ఉన్నాయని అనిపిస్తే.. ఎటువంటి దుస్తులు ధరించడానికైనా వెనుకాడనంటూ తన ఇన్ స్టాగ్రామ్ ఫోటోల గురించి పాయల్ క్లారిటీ ఇచ్చింది.
గ్లామర్ డాల్ అనే ఇమేజీ నుండి బయట పడడానికి ప్రయత్నిస్తోంది పాయల్. తాజాగా ఆమె నటిస్తున్న తెలుగు సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ మార్చి 4 న రిలీజ్ చేయనున్నారు. కైవల్య క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్-మిస్టరీ-డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పాయల్ కెరీర్ లో ది బెస్ట్ అని అంటోంది చిత్ర బృందం. చివరి షెడ్యూల్ మినహా మొత్తం షూటింగ్ పూర్తయిందని.. మార్చిలో చివరి షెడ్యూల్ పూర్తవ్వగానే వేసవిలో సినిమా రిలీజ్ ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహిస్తున్న 'నరేంద్ర' సినిమాలో ఫైటర్ జెట్ పైలట్ గా పాయల్ నటిస్తోంది. పాయల్ లేటెస్ట్ సినిమాలు డిస్కో రాజా, ఆర్డీఎక్స్ లవ్ భారీ ఫ్లాప్ లు గా నిలిచాయి. వెంకీ మామ మాత్రం మంచి కలెక్షన్లు రాబట్టుకుంది. పాయల్ క్యారెక్టర్ కూడా నవ్వులు పూయించింది. పాయల్ కెరీర్ నిలబడాలంటే రాబోయే చిత్రాలు హిట్ టాక్ సంపాదించుకోవడం చాలా ముఖ్యం.