మెజ‌ర్స్ గురించి.. ఇషారెబ్బా మాటల్లో..

By అంజి  Published on  12 Feb 2020 3:27 AM GMT
మెజ‌ర్స్ గురించి.. ఇషారెబ్బా మాటల్లో..

సినీ ఇండస్ట్రీ అన్నాక ప్ర‌తీ ఒక్క‌రిలోనూ చాలానే మైన‌స్‌లు ఉంటాయి. అలా అని ప్ల‌స్‌లు ఉండ‌వ‌ని కాదు. కానీ, కొత్త వారు ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌ప్పుడు కాస్త జాగ్ర‌త్త ప‌డాల్సి ఉంటుంది. ఈ విష‌యం నా అనుభ‌వ పూర్వ‌కంగా చెబుతున్న‌దే. డిఫ‌రెంట్ షూట్స్‌తో పాటు అన్ని ర‌సాల‌ను పండించేలా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ నాట్ డినై. డినై అస్స‌లు చేయ‌కూడ‌దు. మ‌రీ ముఖ్యంగా మెజ‌ర్స్ విష‌యంలో ట్రూత్‌ని చెప్పాల్సి ఉంటుంది. ఫాక్ట్స్ చెప్తేనే ఫ్యూచ‌ర్ విల్ డిసైడ్‌.

ఇంత‌కీ ఇషారెబ్బా ప‌లాన కాస్టూమ్స్ వేసుకోదు అన్న కంప్లైంట్ ఏమైనా ఉందా..? లేక ఎలాంటి కాస్టూమైనా వేసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌తారా..?

ఈ విష‌యంలో నిజం చెప్పాలంటే నేను కాస్టూమ్స్‌ను ఫాలో అవ‌ను. స్టోరీని ఫాలో అవుతా. డైరెక్ట‌ర్స్ స్టోరీ చెప్పే స‌మ‌యంలోనే కాస్టూమ్స్ గురించి డిస్క‌ర్ష‌న్ చేస్తా. క్యారెక్ట‌ర్ డిమాండ్ చేస్తే ఎలా క‌నిపించ‌డానికైనా, ఎలాంటి డ్రెస్ వేసుకోవ‌డానికైనా సిద్ధ‌మే. ఒక‌వేళ స్టోరీ స్విమ్ సూట్‌ను డిమాండ్ చేస్తే త‌ప్ప‌నిస‌రిగా సీన్ పండేందుకు ఆ డ్రెస్ వేసుకుని క‌న‌ప‌డేందుకు నేను రెడీ అని అంటోంది ఇషా రెబ్బా

Advertisement

ఒక‌వేళ బ్యూటీఫుల్ ఇషారెబ్బాకు విల‌న్ క్యారెక్ట‌ర్ వ‌స్తే డెఫ‌నేట్‌గా చేస్తా. అన్నీ క్యూట్, బ‌బ్లీ రోల్సే కాదు. నెగిటివ్ షేడ్స్ క‌లిగిన అమ్మాయిలు కూడా ఉంటారు. అలా చాలా సినిమాల్లో చాలా క్యారెక్ట‌ర్లే ఉన్నాయి. అంతెందుకు రియ‌ల్ లైఫ్‌లోనూ అలా ఉన్నారు. క‌నుక నెగిటివ్ క్యారెక్ట‌ర్స్ చేయ‌డానికి ఎటువంటి ఇబ్బంది లేదు.

ఇంత‌కీ సినీ ఇండ‌స్ట్రీ అమ్మాయిల‌కు సేఫేనా..?

అన్న విష‌యానికొస్తే, హండ్రెడ్ ప‌ర్సెంట్ సేఫ్‌. అందుకు ఎగ్జాంపుల్ నేనే. నెగిటివ్‌, పాజిటివ్ అన్న‌వి అచ్చు, బొమ్మ‌ల్లాంటివి. అవి కేవ‌లం సినీ ఇండ‌స్ట్రీలోనే కాదు బయ‌టి స‌మాజంలోనూ ఉన్నాయి. అంతెందుకు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లోనూ ఉన్నాయి. నెగిటివ్ ఉన్న చోట మ‌న జాగ్ర‌త్త‌లో మ‌నం ఉంటే స‌రిపోతుంది. ఎందుకంటే సినీ ఇండ‌స్ట్రీ అన్నాక చాలా మందిని క‌లుస్తుంటాం. డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్ ఉంటుంది.

Advertisement

మ‌న తెలుగు ఇండ‌స్ట్రీలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా నిల‌దొక్కుకోలేక‌పోతున్నారు. దాంతో వాళ్ల సంఖ్య కూడా ఇండ‌స్ట్రీలో చాలా త‌క్కువ‌గా ఉంది. అలా ఎందుకు జ‌రుగుతుందో నాక్కూడా తెలీదు. నేనొచ్చి ఫైవ్ ఇయ‌ర్స్ అయింది. అయినా నేనింకా స్ట్ర‌గుల్ అవుతూనే ఉన్నా. న‌న్ను ఇంట‌ర్వ్యూ చేసే ప్ర‌తీ ఒక్క‌రూ ఈ విష‌యాన్ని న‌న్ను అడుగుతుంటారు. నాకేలా తెలుస్తుంది తెలుగు అమ్మాయిల‌కు ఛాన్స్‌లు ఎందుకు రావ‌డం లేదో. డైరెక్ట‌ర్ల‌ను, నిర్మాత‌ల‌ను అడిగితే తెలుస్తుంది. ఒక‌సారి వాళ్ల‌ను అడ‌గండి. వాళ్ల‌నే అడగండి.

ఐ రియ‌ల్లీ డోన్ట్ నో. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో లోక‌ల్ వారికి అవ‌కాశాలు రాక‌పోవ‌డంపై నాకు ఇప్ప‌టికీ సర్‌ప్రైజ్ ఇష్యూగానే ఉంది. వెరీ లెస్ ఆప‌ర్చునిటీస్ ఫ‌ర్ తెలుగు వాళ్ల‌కు. ఒక సినిమాలో వేరే భాషల వాళ్ల‌ను తీసుకున్నా ఫిఫ్టీ ఫిఫ్టీ లేదా ఫార్టీ, క‌నీసం థ‌ర్టీ ప‌ర్సెంట్ అయినా అవ‌కాశాలు ఇస్తే చాలా బాగుంటుంది. దీనిపై ఎవ‌రూ నోరు మెద‌ప‌డం లేదు. బ‌య‌టి వాళ్లు రావ‌డం ఆగ‌డం లేదు. ఒక బౌండ‌రీ అంటూ పెట్ట‌లేదు. స్టిల్ యు హావ్ టు ఎంక‌రేజ్ యువ‌ర్ లోక‌ల్ టాలెంట్ ఎవ్రీ వ‌న్‌.

Next Story
Share it