క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన అనుష్క

By రాణి  Published on  21 March 2020 5:58 PM IST
క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన అనుష్క

టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్..ఇండస్ర్టీ ఏదైనా సరే అందులో క్యాస్టింగ్ కౌచ్ ఉందని స్పష్టంగా చెప్పారు హీరోయిన్ అనుష్క శెట్టి. వేరేవాళ్లు దీని గురించి చెప్తుంటే విన్నాను..వారి బాధను కళ్లారా చూశాను. తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదని చెప్పలేం కానీ..తనకెప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదన్నారు. ఎందుకంటే తాను చాలా ముక్కుసూటిగా మాట్లాడుతానన్నారు. ఎవరైనా సరే ఒక అమ్మాయి నుంచి ఈ రకంగా సుఖం పొందాలనుకోవడం పెద్ద నేరమేనన్నారు. ఇది ఒకరికి సంబంధించిన వ్యక్తిగత అభిప్రాయమైనప్పటికీ..ఇండస్ర్టీలో ఈజీగా పాపులర్ అవ్వాలా లేక కష్టపడి పైకి రావాలా ? అన్న విషయాలు ఇలాంటి పనులు చేసేవారు ఆలోచించుకోవాల్సి ఉంటుందన్నారు.

Also Read : జగన్ ప్రభుత్వంపై కేంద్రం చర్యలు తీసుకోవాలి : నారా లోకేష్

ఏదేమైనా మహిళ పై ఒక వ్యక్తి మోజుపడి అడిగినపుడు ఆ మహిళ దానిని సున్నితంగా, ధైర్యంగా తిరస్కరిస్తేనే వాళ్లు మహిళలను గౌరవించడం మొదలుపెడతారని చెప్పారు దేవసేన. అనుష్క, గీతాంజలి, షాలినీపాండే, మాధవన్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించిన నిశ్శబ్దం సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించాయి. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రచారంలో భాగంగానే అనుష్క ఓ మీడియాతో ఈ విషయాలన్నీ పంచుకున్నారు.

Also Read : దేశవ్యాప్తంగా 294..తెలంగాణలో 21 కరోనా కేసులు

ప్రేమ, పెళ్లి విషయంపై అనుష్కను ప్రశ్నించగా..సెలబ్రిటీ పర్సనల్ జీవితంపై ఎన్నో వదంతులొస్తాయి. అవన్నీ పట్టించుకోలేం. ఆ వదంతులపై స్పందించనూ లేను. కానీ..నాగురించి వదంతులు, పుకార్లు పుట్టించిన వారికి అక్కచెల్లెళ్లు, ఆడపిల్లలు ఉండకుండానే ఉంటారా అని అనుకుని నవ్వుకుంటా అని చెప్పారు.

Next Story