సుమంత్.. కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2019 11:14 AM GMT
సుమంత్.. కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్.

హీరో సుమంత్ ఈ మధ్య చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఒక్కో సినిమా కోసం చాలా సమయం తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ హీరో నుంచి ఓ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. 2018లో కేరళలో విడుదలై మంచి విజయం సాధించిన 'పాదయోట్టం' సినిమా ఆధారంగా సుమంత్ కొత్త సినిమా తెరకెక్కునుంది. గ్యాంగ్‌స్టర్, కామెడీ డ్రామాగా తెరకెక్కబోయే ఈ చిత్రం..తెలుగు వర్షన్‌కు విను యజ్ఞ దర్శకుడుగా వ్యవహారిస్తున్నారు.

'ఐమా' అనే కొత్త హీరోయిన్ ఈ సినిమాతో పరిచయం కానుంది. డిసెంబర్ 15, 2019 నుంచి పాదయోట్టం తెలుగు రీమేక్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈస్ట్ ఇండియా టాకీస్, ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై.. తమ్మినేని జనార్ధన రావు, శర్మ చుక్క ఈ సినిమాను సంయక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రయూనిట్‌ త్వరలోనే తెలియజేయనున్నారు.

సుమంత్, ఐమా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు: విను యజ్ఞ, నిర్మాతలు: తమ్మినేని జనార్ధన రావు, శర్మ చుక్క, నిర్మాణ సంస్థలు: ఈస్ట్ ఇండియా టాకీస్, ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్: షి రాజ్ కుమార్ లైన్ ప్రొడ్యూసర్: బాలాజీ శ్రీను.

Next Story
Share it