ప్చ్.. కీలక దశలో టాలెంటెడ్ హీరో కెరీర్ !

By Newsmeter.Network  Published on  11 Dec 2019 9:28 AM GMT
ప్చ్.. కీలక దశలో  టాలెంటెడ్ హీరో కెరీర్ !

టాలీవుడ్ లో వైవిధ్యమైన పాత్రలను చేస్తోన్న హీరోల్లో శర్వానంద్ పేరే ముందువరుసలో ఉంటుంది. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ రెండు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ టాలెంటెడ్ హీరో. తమిళ హిట్ మూవీ '96' తెలుగు రీమేక్ సినిమాతో పాటు తరువాత చేయబోయే మూవీ స్క్రిప్ట్ పై కూడా ఇప్పటికే కసరత్తలు ప్రారంభించాడట. ఫిబ్రవరి ఎండింగ్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నాడు. పైగా ఈ రెండు సినిమాలు అవ్వగానే గ్యాప్ లేకుండా మరో కొత్త సినిమా మొదలయ్యేలా మరో స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు శర్వానంద్. అయితే అది తెలుగు సినిమా కాదు.. డైరెక్ట్ తమిళ చిత్రం చెయ్యబోతున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ కొరియోగ్రఫర్ రాజు సుందరం డైరెక్ట్ చేయనున్నాడు. కొన్నిరోజులుగా చర్చల దశలోనే ఉన్న ఈ చిత్రం అన్ని అంశాలు అనుకూలించడంతో సెట్స్ మీదికి వెళ్లేందుకు రెడీ అవుతుంది.

కాగా ఈ సినిమా తెలుగులో డబ్ కానుంది. మరి తెలుగులో హిట్ వచ్చి చాల కాలం అయిన శర్వానంద్ కి తమిళంలో అయినా హిట్ వస్తోందా..? ఇప్పటికే గతంలో 2011లో వచ్చిన తమిళ్ సినిమా 'ఎంగేయుమ్ ఇప్పోతుమ్' (తెలుగులో జర్నీ)లో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించాడు. మళ్లీ దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత ఇప్పుడు నటించబోతున్నాడు. ఫేమస్ కొరియోగ్రఫర్ మొదటిసారి డైరెక్షన్ చేస్తుండటంతో ఈ సినిమా పై తమిళ ప్రేక్షకుల్లో కూడా బాగానే ఆసక్తి ఉంది. మరి రాజు సుందరం శర్వానంద్ కి హిట్ ఇస్తాడో లేదో చూడాలి. ఎలాగూ గత చిత్రం రణరంగం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలవడంతో శర్వా కెరీర్ కి ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు చాల కీలకంగా మారాయి.

Next Story