ఈ రోజుల్లో సినిమాని  చాల ఈజీగానే తీసేస్తున్నారు గాని, ఆ సినిమాని జనంలోకి తీసుకెళ్ళటానికే నానా కష్టాలు పడాల్సి వస్తోంది.  ప్రమోషన్ లేకపోతే  స్టార్ హీరో సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతొంది.  అందుకే తమ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి సినిమా జనాలు కొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటు  సోషల్ మీడియాలోనూ  అనేక మార్గాల ద్వారా సినిమా రిలీజ్ కు ముందు తమ సినిమా జనానికి  తెలిసేలా ప్రమోషన్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్.  ప్రస్తుతం “ప్రతిరోజూ పండగే” టీమ్ కూడా అలాంటి ప్రమోషన్స్ ను చేస్తోంది.

 

Image (6)
సాయి తేజ్ హీరోగా.. మారుతి డైరెక్టర్ గా  బన్నీ వాస్ నిర్మాతగా   డిసెంబర్ 20న రానుంది ఈ  చిత్రం. దాంతో గత కొద్ది రోజులుగా చిత్రబృందం ఆంధ్రా మొత్తం తిరుగుతూ  అభిమానులను కలుసుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు వైజాగ్, గుంటూరు  ఇలా ఆంధ్రాలోని చాల ప్రాంతాలలో తిరుగుతూ సినిమా గురించి  కాస్త గట్టిగానే  ప్రచారం చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే  ప్రతిరోజు పండుగే  టీంకు  ప్రేక్షకుల నుండి కూడా ఘనస్వాగతం లభిస్తుంది.  ఖచ్చితంగా ఈ ప్రమోషన్స్  సినిమా ఓపెనింగ్స్ కి  చాల పనికొస్తాయి. 
Image (5)
 
కాగా  పక్కా పల్లెటూరి నేపథ్యంలో రానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై ఇప్పటికే ప్రేక్షుకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.  ఇక ఈ సినిమాలో సాయి తేజ్ సరసన గ్లామర్ బ్యూటీ  రాశి ఖన్నా హీరోయిన్ గా  నటిస్తోంది. గతంలో వీరిద్దరూ “సుప్రీం” చిత్రంలో కలిసి నటించారు. అలాగే   మిగిలిన కీలక పాత్రల్లో సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ తదితరులు నటిస్తుండగా, ఈ సినిమాకి యస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా సాయి తేజ్ కి హిట్ వస్తోందేమో చూడాలి.  
Image (7)   

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.