మెగా హీరోకి పరీక్ష మొదలైంది !

By Newsmeter.Network  Published on  8 Dec 2019 10:01 AM GMT
మెగా హీరోకి పరీక్ష మొదలైంది !

మెగా సుప్రీమ్ హీరో 'సాయి తేజ్' ఇండస్ట్రీలోకి 'పిల్లా.. నువ్వులేని జీవితం' అనే సూపర్ హిట్ సినిమాతోనే గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. 'చిత్రలహరి'కి ముందు బాక్సాఫీస్ వద్ద వరుసగా ఆరు డిజాస్టర్ లతో సతమతమయ్యాడు. 2015లో వ‌చ్చిన ‘సుప్రీమ్’ మూవీ త‌ర్వాత చేసిన 'తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు' ఇలా సాయి తేజ్ నటించిన సినిమాలన్నీ భారీ ప్లాప్ లే. ఈ డిజాస్టర్‌ ల దెబ్బకి తేజ్ మార్కెట్ రేంజ్ కూడా 'షేర్ మార్కెట్'లా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ ప్రభావం వల్లే 'నేను శైలజ' ఫెమ్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వచ్చిన 'చిత్రలహరి'కి మంచి హిట్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దాంతో హిట్ వచ్చినా.. ఈ మెగా మేనల్లుడు డీలా పడాల్సిన పరిస్ధితి. ఇక ప్రస్తుతం సాయి తేజ్ డైరెక్టర్ మారుతితో చేస్తోన్న "ప్రతిరోజూ పండగే" మూవీ ఫై కూడా ఆ డిజాస్టర్ ల షేడ్ బాగానే పడింది. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మార్కెట్ ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ లకు వచ్చిన రెస్పాన్స్ ప్రకారం ఈ చిత్రానికి బయ్యర్స్ నుంచి ఫుల్ డిమాండ్ ఉండాలి, కానీ బయ్యర్లు ఈ మూవీ కోసం నిర్మాతలు అడిగినంత ఇవ్వడానికి ముందుకు రాలేదట.

కాగా ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ టూర్ లో ఫుల్ బిజీగా వుంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే వదిలిన సాంగ్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. క్రిష్టమస్ సందర్భంగా డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ కానుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సాయి తేజ్ సరసన రాశి ఖన్నా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ "సుప్రీం"లో కలిసి నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఏమైనా ఈ చిత్రం రిజల్ట్ ను బట్టే బాక్సాఫీస్ వద్ద 'సాయి తేజ్' మార్కెట్ ఆధారపడి ఉంటుంది. మొత్తానికి మెగా హీరోకి ఇది పరీక్షే. మరి పరీక్షలో నెగ్గుతాడో తగ్గుతాడో చూడాలి.

Next Story
Share it