ప్రభాస్‌ సినిమా అప్‌డేట్‌..  బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన వైజయంతీ మూవీస్

By సుభాష్  Published on  9 Oct 2020 10:43 AM IST
ప్రభాస్‌ సినిమా అప్‌డేట్‌..  బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన వైజయంతీ మూవీస్

'బాహుబలి' చిత్రం తరువాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రేంజ్‌ మారిపోయింది. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని కోట్లాది మంది సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ చిత్రం తెరకెక్కనుంది. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్విన్‌దత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనే నటిస్తోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ సరికొత్త అప్‌డేట్‌ను చిత్ర నిర్మాణ సంస్థ అభిమానులతో పంచుకుంది. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్, ఇండియా గర్వించదగ్గ నటుడు అమితాబ్ బచ్చన్.. తమ చిత్రంలో నటించనున్నారని ప్రకటించింది.

ఆయన చేరికతో తమ ప్రయాణం మరింత విజయవంతమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో కొత్త తరహా కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంతో ప్రొడక్షన్‌లో ఉన్న అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ఒకటనేది నిస్సందేహం. ఈ పాన్ ఇండియన్ ఫిల్మ్ కోసం పనిచేయడానికి పలువురు క్రియేటివ్ పీపుల్ ఒకరి తర్వాత ఒకరుగా వస్తున్నారు. తన కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మక బ్లాక్‌బస్టర్స్ రూపొందించిన లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ ప్రాజెక్ట్‌కు స్క్రిప్ట్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.



Next Story