'ప్ర‌భాస్' కోసం 'పూజా' సరి కొత్త లుక్ ?

By Newsmeter.Network  Published on  24 Dec 2019 12:30 PM GMT
ప్ర‌భాస్ కోసం పూజా సరి కొత్త లుక్ ?

నేషనల్ స్టార్ గా చలామణి అవుదామని 'ప్ర‌భాస్' మంచి ప్లాన్ వేసి మరీ.. అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో 'సాహో'తో అట్టహాసంగా ప్రేక్షుకుల ముందుకు వచ్చాడు. కానీ ఏం లాభం.. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేక చతికిలపడింది. దాంతో ప్రభాస్ తన తరువాత మూవీ 'జాన్' పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. కాగా తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ విషయం తెలిసింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ మ్యూజిక్ టీచర్ గా కనిపించబోతుందట. ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా అప్పటి ట్రెడిషనల్ గెటప్ ను పోలి ఉండేలా డిజైన్ చేశారట.

ఇప్పటికే టాల్ బ్యూటీ తన లుక్ పై కసరత్తు మొదలు పెట్టిందట. అన్నట్లు రీసెంట్ గా విడుదలైన గద్దలకొండ గణేష్ సినిమాలోనూ పూజా 90ల నాటి కాలేజ్ గర్ల్ గా కనిపించి అలరించింది. మరి జాన్ సినిమాలో ఆమె ఎలా ఉంటారో చూడాలి. ఇక ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ కూడా కాస్త బిన్నంగా కనిపిస్తాడని తెలుస్తోంది. రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ లవ్ స్టోరీనే ఈ చిత్రం అని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

జాన్ మూవీలో బాగా ఎంటర్టైన్ మెంట్ ఉండేలా చూసుకుంటున్నాడు డార్లింగ్. అందులో భాగంగానే స్క్రిప్ట్ ను మళ్లీ ఒక్కసారి మొత్తం సరి చూసుకోమని ఇప్పటికే డైరెక్టర్ కి కూడా చెప్పాడు. ఆ దిశగా రైటర్స్ చేత స్క్రిప్ట్ వర్క్ కూడా చేయిస్తోన్నారు దర్శకనిర్మాతలు. మూడు భాషల్లో రాబోతున్న ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 ఆఖర్లో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Next Story
Share it