అయ్యో ! 'గజదొంగ' దెబ్బకి పారిపోతున్న హీరోలు !
By రాణి Published on 23 Dec 2019 12:21 PM GMT'దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త' లాంటి బిలో ఏవరేజ్ సినిమాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ గత రెండు సంవత్సరాల నుంచీ రూపొందే ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఇప్పటికే కొన్ని సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. కానీ హీరో మారిపోయాడు. యాక్షన్ కోసం ఆరాటపడే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ చిత్రం మొదట మొదలైంది. కానీ సినిమా షూటింగ్ మధ్యలోనే బెల్లంకొండ నిర్మాతల మీద పెద్ద బండ వేసి సినిమా నుండి నిష్ర్కమించాడు.
ఇప్పుడేమో ఈ సినిమాకి ఒక్క హీరో కూడా దొరకట్లేదట. ఎవరి దగ్గరకు వెళ్లినా విలన్ పాత్ర అనగానే తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని హీరోలు తెగ భయపడిపోతున్నారట. ఈ సినిమాలోని హీరో పాత్ర పక్కా నెగిటివ్ గా ఉంటుందని హీరోల ఫీలింగ్ కావొచ్చు. అయితే సినిమాలో దొంగతనం చేసే సన్నివేశాలు చాల బాగుంటాయని.. అలాగే టైగర్ నాగేశ్వరరావు పాత్రకు సంబంధించిన సన్నివేశాల్లోనే మంచి ఫన్ ఉంటుందని.. మొత్తానికి గజదొంగ కామెడీ బాగా చేస్తాడని తెలుస్తోంది. మరి చివరకి ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారో చూడాలి.
ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన ఈ స్టువర్ట్ పురానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు 1980 - 90 దశకాల్లో గజదొంగగా ఒక వెలుగు వెలిగాడు. అలాంటి టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ అంటే అప్పటి సంగతులు కాస్త ఇంట్రస్టింగ్ గానే ఉంటాయి. అన్నట్లు ఈ బయోపిక్ లో బోల్డ్ బడా బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. పైగా పాయల్ ఈ సినిమాలో వేశ్య పాత్రలో కనిపించనుంది. మామాలుగానే అర్ధనగ్న షో లతో హీట్ పుట్టించే పాయల్ మరి వేశ్య పాత్రలో ఎంత రెచ్చిపోతుందో చూడాలి.