అరె.. బాలయ్యలో మార్పు.. గైడ్ వచ్చేశాడు !

By Newsmeter.Network  Published on  29 Dec 2019 1:19 PM GMT
అరె.. బాలయ్యలో మార్పు.. గైడ్ వచ్చేశాడు  !

బాలయ్య మారాలని డిసైడ్ అయ్యాడట

నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమాలు అంటే, ఒకప్పుడు ఆయన ఫ్యాన్స్ హడావుడి ఓ రేంజ్ లో ఉండేది. కానీ ఈ మధ్య బాలయ్య సినిమాలను 'బాలయ్య ఫ్యాన్స్' కూడా పట్టించుకోవట్లేదు. అందుకే బాలయ్య మారాలని డిసైడ్ అయ్యాడట. ఇక నుండి తన సినిమా స్టోరీస్ విషయంలో.. తానూ చేసే యాక్షన్ విషయంలో బాలయ్య ఓ గైడ్ ను పెట్టుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్యతో ఎప్పటినుండో సన్నిహితంగా ఉంటున్న రచయిత 'ఎమ్ రత్నం' ఇక నుండి బాలయ్య చేయబోయే సినిమాలకు వర్క్ చేయనున్నారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రేక్షుకులను దృష్టిలో పెట్టుకుని బాలకృష్ణ చిత్రాలను ప్లాన్ చేసుకుంటున్నాడట. ఆ విషయంలో ఎమ్ రత్నం అన్ని తప్పొప్పులను సరి చూస్తాడట. బాలయ్య చేయబోయే సినిమాల్లో కొత్తదనం ఖచ్చితంగా ఉండేలా ఎమ్ రత్నం డైరెక్టర్స్ తో చర్చించి.. బాలయ్యకి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తాడట.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకి ఎమ్ రత్నంనే డైలాగ్ రైటర్. జనవరి నెలలోనే ఈ సినిమాను స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో 'సింహ, లెజెండ్' సినిమాల మాదిరిగా మాస్ అండ్ యాక్షన్ తో పాటు బాలయ్యను కొత్తగా చూపించాలని చూస్తున్నాడు బోయపాటి. బాలయ్య కూడా న్యూ లుక్ కోసం ఇప్పటికే వర్కౌట్స్ కూడా చేస్తున్నాడు. అన్నట్లు బాలయ్య మార్కెట్ కి తగ్గట్లు స్క్రిప్ట్ లో మార్పులు చేయించాల్సి వచ్చింది. అయితే బోయపాటి మాత్రం కొత్త తరహా కథను సిద్దం చేశాడని.. మొత్తానికి బాలయ్యను ఈ సినిమాలో చాల కొత్తగా చూడొచ్చని తెలుస్తోంది.

ఇక బాలయ్య కూడా ఈ తరం ప్రేక్షుకులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షుకులను ఆకట్టుకోవాలని గట్టిగా భావిస్తున్నాడు. మరి బాలయ్య బాబు చూపించే కొత్తదనం ఎలా ఉంటుందో.. అన్ని వర్గాలను బాలకృష్ణ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాలి.

Next Story