నాగార్జున త‌దుప‌రి చిత్రం ఎప్పుడు..? ఎవ‌రితో..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2019 11:59 AM GMT
నాగార్జున త‌దుప‌రి చిత్రం ఎప్పుడు..? ఎవ‌రితో..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున బిగ్ బాస్ 3 సీజ‌న్‌లో హోస్ట్‌గా చేయ‌డం..ఇటీవ‌ల ఈ సీజ‌న్ కంప్లీట్ కావ‌డం తెలిసిందే. దీంతో నాగ్ సినిమాల పై దృష్టిపెట్టారని సమాచారం. అయితే ఇటీవ‌ల న‌టించిన మ‌న్మ‌థుడు 2 సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఎలాగైనా స‌రే.. స‌క్స‌స్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో నాగ్‌ ఉన్నారు. దీనిలో భాగంగా ఊపిరి, మ‌హ‌ర్షి చిత్రాల‌కు రైటర్‌గా వ‌ర్క్ చేసిన సోల్మాన్‌తో పని చేయాలి అనుకుంటున్నారని స‌మాచారం.

ఈ మేరకు ఇప్పటికే రైట‌ర్ సోల్మాన్ చెప్పిన క‌థ నాగార్జున‌ విన్నారు. సోల్మాన్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను కూడా అత‌నికే అప్ప‌చెప్పినట్లు సమాచారం. అయితే ఈ చిత్రం రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్‌ కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీ అని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందే ఈ సినిమాని మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మించ‌నుంద‌ని సమాచారం.

ఇందులో న‌టించే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ను ఫైన‌ల్ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతరం డిసెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో సెట్స్‌ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అఫిషియల్‌గా మూవీని ఈ నెలలోనే ఎనౌన్స్‌ చేయనున్నారని టాక్‌. అంతా అనుకున్నట్లు జరిగితే సమ్మర్‌లో ఈ సినిమాని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. మ‌రి... స‌రైన స‌క్సస్ కోసం ఎదురు చూస్తోన్న నాగార్జున‌కి ఈ సినిమా ఆశించిన విజ‌యాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

Next Story